Miryalaguda : ద్విచక్ర వాహనాల చోరీ.. భాగాలు విడతీసి విక్రయించే ముఠా అరెస్ట్..!
ద్విచక్ర వాహనాలు చోరీ చేసే ముఠాను అరెస్టు చేసినట్లు మిర్యాలగూడ సి ఐ సోమనర్సయ్య పేర్కొన్నారు.

Miryalaguda : ద్విచక్ర వాహనాల చోరీ.. భాగాలు విడతీసి విక్రయించే ముఠా అరెస్ట్..!
మిర్యాలగూడ, మనసాక్షి :
ద్విచక్ర వాహనాలు చోరీ చేసే ముఠాను అరెస్టు చేసినట్లు మిర్యాలగూడ సి ఐ సోమనర్సయ్య పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు చోరీ చేసే ముఠా లో నల్లగొండ ఆర్జాలబావికి చెందిన కొంగరి నవీన్ కుమార్, సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం గుడుగుంట్ల పాలెం కు చెందిన సోమిరెడ్డి సైదిరెడ్డి, దామరచర్ల మండలం వాడపల్లికి చెందిన కంచరకుంట్ల సుమలతలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
వారి నుంచి రెండు మోటార్ సైకిల్ 1.38 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ వద్ద వాహనంపై వెళ్తున్న వారిని ఆపడంతో ఎలాంటి పత్రాలు చూపకపోగా అనుమానం వచ్చి అరెస్ట్ చేసి విచారించాము. నిందితులు మద్యం సేవించి, గుట్కా వినియోగించడం, పేకాట ఆడటం వంటి చెడు లక్షణాలు కలిగి ఉన్నారు. నవీన్ కుమార్, సోమిరెడ్డి సైదిరెడ్డిలు ద్విచక్ర వాహనాలను చోరీ చేసి వాడపల్లిలోని పాత ఇనుము దుకాణం నడుపుతున్న కంచరకుంట్ల సుమలతకు విక్రయిస్తారు.
కాగా వీరు మోటార్ సైకిల్ ను 2500 నుంచి 3000 రూపాయలకు కొనుగోలు చేసి విడిభాగాలను విభజించి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలినట్లు తెలిపారు. కాగా కేసులు చేదించిన ఏఎస్ఐ గఫార్, హెడ్ కానిస్టేబుల్ స్వర్ణ నాయక్, కానిస్టేబుల్ బాలకృష్ణ,కళ్యాణ్, మణిదీప్, సమద్, అక్బర్ పాషా, రామకృష్ణ, రాజశేఖర్, లక్ష్మణులను అభినందించారు.









