Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన మహిళ ఉద్యోగిని.. ఇంట్లో కట్టల కొద్ది నోట్లు, కిలోల కొద్ది బంగారం..!

ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన మహిళ ఉద్యోగిని.. ఇంట్లో కట్టల కొద్ది నోట్లు, కిలోల కొద్ది బంగారం..!

హైదరాబాద్, మన సాక్షి :

లంచం తీసుకుంటూ (ఎ సి బీ) అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఓ మహిళ ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. దొరకగానే ఆమె ఏడుపు లంకించుకుంది. సంఘటన వివరాల ప్రకారం.. హైదరాబాదులోని మాసబ్ ట్యాంక్ గిరిజన పరిపాలన భవనంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా జగత్ జ్యోతి పనిచేస్తుంది.

గంగన్న అనే కాంట్రాక్టర్ కు నిజామాబాదులో పూర్తిచేసిన పనికి బిల్లులు మంజూరు చేయాల్సి ఉంది. దాంతో పాటు హైదరాబాదు శివారులోని గాజుల రామారంలో గిరిజన సంక్షేమ శాఖ నిర్మిస్తున్న జువైనల్ బాలుర వసతి గృహం కాంట్రాక్ట్ కూడా ఆయనకి దక్కింది. నిజామాబాదులో పూర్తయిన పనికి బిల్లులు, గాజులరామారం పనికి అంచనాలు సవరించడానికి ఇంచార్జ్ ఎస్సీ జగ జ్యోతి లచ్చ డిమాండ్ చేసింది. కాంట్రాక్టర్ గంగన్న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

ALSO READ : పేకాటరాయులను పట్టుకున్న పోలీసులు..!

ఆమె సంతకం కోసం కాంట్రాక్టర్ జగ జ్యోతి వద్దకు వెళ్లారు. అయితే ఆ సంతకం పెట్టడానికి ఆమె కాంట్రాక్టర్ నుంచి 84 వేల రూపాయలు లంచం తీసుకుంది. కాగా లంచం తీసుకుంటూ ఏసిబీ అధికారులకు హ్యాండెడ్ గా దొరికింది. దానితో జగ జ్యోతి పై కేసు నమోదు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయంతో పాటు ఆమె ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇంట్లో ఉన్న లక్షల రూపాయల నగదు, కిలోల కొద్ది బంగారం ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఆమె ఇంట్లో కట్టలు కొద్ది నోట్లు కిలోల కొద్ది బంగారం :

ఏసీబీ అధికారులు జగ జ్యోతి ఇంట్లో సోదరులు నిర్వహించగా 65 లక్షల నగదు తో పాటు నాలుగు కిలోల బంగారం లభ్యమైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఆమె పని చేస్తున్న కార్యాలయంలో కూడా కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈఈ స్థాయి అధికారి జగ జ్యోతి ఇన్చార్జి హోదాలో ఎస్ ఈ గా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు