కల్తీ టీ పొడి.. విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్..!
కల్తీ టీ పొడి.. విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్..!
కుల్కచర్ల, మన సాక్షి:
వాహనాలను తనిఖీ చేస్తుండగా విక్రయానికి తీసుకుపోతున్న కల్తీ టీ పొడి పట్టుబడిన సంఘటన కుల్కచర్ల మండల కేంద్రంలోని చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై అన్వేష్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కుల్కచర్ల లోని వాహనాలను తనిఖీ చేస్తుండగా బైకు పై వెళ్తున్న ఓ వ్యక్తి వద్ద నిండుగా ఉన్న రెండు బ్యాగులు కనిపించాయని చెప్పారు.
ఆ బ్యాగును అనుమానంతో పరిశీలించగా గండేడ్ మండల కేంద్రానికి చెందిన సురేష్ అందులో 60 కిలోల కల్తీ టీ పొడిని కుల్కచర్ల లో విక్రయానికి తీసుకు వస్తున్నట్లుగా వెళ్లడైందని తెలియజేశారు. ఈయనకు నగరానికి చెందిన వెంకట్ ప్రసాద్ టీ పొడిని సరఫరా చేస్తున్నారని అక్కడ కూడా దాడులు నిర్వహించడంతో వెంకట్ ప్రసాద్ వద్ద రెండు క్వింటాళ్ల టీ పొడి లభ్యమైనదని ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఆయన ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా రసాయనాలను వినియోగించి తయారు చేస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి టీ పొడిని వినియోగిస్తే ప్రజలు అనారోగ్యం ఏర్పడుతుందని కల్తీ ఇట్టి పొడిని ఎవరు తయారు చేసిన చట్టారీత్యా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై అన్వేష్ కుమార్ రెడ్డి తెలిపారు.
MOST READ :
-
Vegetables : బెండకాయ కొందరికి హానీకరం, మరికొందరికి ప్రయోజనం.. ఆలస్యం కాకముందే ఎందుకో తెలుసుకోండి..!
-
Tomato Juice : తినడానికి బదులు టమోటా రసం తాగండి.. 30 రోజుల్లో ఈ 5 అద్భుతమైన ప్రయోజనాలు..!
-
Cm Revanth : నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. 35వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్..!
-
Nalgonda : జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసిన ఎంపీడీవో, గ్రామ కార్యదర్శులను విధుల్లోకి తీసుకోవాలి.. లేదంటే ముమ్మడి సెలవులంటూ హెచ్చరిక..!









