క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : మదర్సా నుంచి పారిపోయిన ఇద్దరు విద్యార్థులు..!
Miryalaguda : మదర్సా నుంచి పారిపోయిన ఇద్దరు విద్యార్థులు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని మదర్సా నుంచి ఇద్దరు విద్యార్థులు పారిపోయిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. మిర్యాలగూడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామంలోని మదర్సా లో ఆంధ్ర ప్రదేశ్ లోని పల్నాడు జిల్లా దాచేపల్లి మండల కేంద్రానికి చెందిన జానీ పాషాకుమారుడు షేక్ ఉస్మాన్ , షఫీ కుమారుడు షేక్ అయూబ్ మదర్సా లో చదువుతున్నారు.
వీరు సోమవారం తెల్లవారుజామున మదర్సాలో అందరు నిద్రిస్తున్న సమయంలో గోడ దూకి పారిపోయారు. కాగా మదర్సా సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు ఇంటికి రాలేదని తెలిపారు. విద్యార్థుల ఆచూకీ తెలియకపోవడంతో సోమవారం రాత్రి మదర్సా స్టాప్ యూసుఫ్ బాబా మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
MOST READ :
-
Transco : విద్యుత్ అధికారుల సరికొత్త నిర్ణయం.. రైతులతో కలిసి పొలంబాట..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి లక్ష రూపాయల రుణమాఫీ.. లేటెస్ట్ అప్డేట్..!
-
TG News : పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ కలకలం.. 15 మంది సస్పెండ్, 47 మంది ఎంపీ ఓ లకు షోకాజ్..!
-
PMKY : రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఖాతాలలో రూ.2000 జమ..!









