Miryalaguda : మిర్యాలగూడలో భూగర్భ డ్రైనేజీ పనులు వేగవంతం చేయాలి.. ప్రజారోగ్య శాఖ ఎస్సీ ఆదేశం..!
Miryalaguda : మిర్యాలగూడలో భూగర్భ డ్రైనేజీ పనులు వేగవంతం చేయాలి.. ప్రజారోగ్య శాఖ ఎస్సీ ఆదేశం..!
మిర్యాలగూడ, మన సాక్షి:
మిర్యాలగూడ పట్టణంలో జరుగుతున్న భూగర్భ మరుగునీటిపారుదల ప్రాజెక్టు, మిషన్ భగీరథ పైపులు లింకేజీ పనులను వేగవంతం చేయాలని ప్రజారాజ్య శాఖ ఎస్సీ కందుకూరు వెంకటేశ్వర్లు ఆదేశించారు.
శుక్రవారం సాయంత్రం పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పనుల పురోగతిని పరిశీలించారు. పట్టణంలోని పదో వార్డు పరిధిలోని నందిపాడు రవీంద్ర నగర్ కాలనీలో అంతర్గత డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
కోదాడ జడ్చర్ల ప్రధాన రహదారిపై తారు రోడ్డు వేసి మాన్ హోల్లను మూసివేసినందున వాటిని వెలికి తీసి మూతలు ఏర్పాటు చేయాలన్నారు. ఓకే ఓకే అద్దంకి బైపాస్ కూడలి వద్ద హనుమాన్ పేటలో భూగర్భ మురుగు నీటి పైపులను అనుసంధానం చేయాలన్నారు.
పట్టణంలో నిర్మిస్తున్న నూతన ఉపరితల నీటి ట్యాంకు నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. భూగర్భ నీటి పైపులు పూడిపోయిన చోట శుభ్రం చేయించాలని ఆదేశించారు. ఆయన వెంట ప్రజా ఆరోగ్య శాఖ ఈఈ సత్య నారాయణ, డిఈలు వెంకన్న, మనోహర్,ఏఈ సాయి తేజ,తదితరులు ఉన్నారు.
MOST READ :
-
District collector : గవర్నర్ పర్యటన ఏర్పాట్లు ముమ్మరం చేసిన జిల్లా కలెక్టర్..!
-
District collector : ఇందిరమ్మ ఇళ్ల ధరఖాస్తుదారులకు సమస్యలుంటే.. వారి కోసం టోల్ ఫ్రీ నెంబర్.. జిల్లా కలెక్టర్ వెల్లడి.!
-
Gold Price : మహిళలకు గోల్డెన్ న్యూస్.. వరుసగా మూడో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..!
-
ISRO : 22 ఏళ్లకే.. అతి చిన్న వయసులో ఇస్రోలో సైంటిస్ట్ గా ఉద్యోగం..!









