Bandi Sanjay : ఇంకెన్నాళ్లు బీఆర్ఎస్ కు దోచిపెడతారు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..!

Bandi Sanjay : ఇంకెన్నాళ్లు బీఆర్ఎస్ కు దోచిపెడతారు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..!
కరీంనగర్, మనసాక్షి :
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోని గ్రానైట్ అసోషియేషన్ నాయకులకు ఝలక్ ఇచ్చారు. 20 ఏళ్లుగా గ్రానైట్ వ్యాపారులంతా బీఆర్ఎస్ కు దోచిపెడుతూనే ఉన్నారని, ఇంకెన్నాళ్లు దోచిపెడతారని ప్రశ్నించారు. ఒక్కో గ్రానైట్ కటింగ్ మిషన్ దుకాణం నుండి సభ్యత్వం పేరుతో గ్రానైట్ అసోసియేషన్ రూ.10 లక్షల నుండి రూ.50 లక్షలదాకా వసూలు చేసిందని, ఆ సొమ్మును ఏం చేశారని చెప్పాలన్నారు.
గ్రానైట్ వ్యాపారుల నుండి వెయ్యి కోట్లు తీసుకున్నట్లు నాపై కొందరు దుష్ప్రచారం చేస్తూ నిందలేసినా ఖండించలేదని అన్నారు. గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ గురువారం తొలుత మానకొండూరు చెరువు వద్దకు ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడ గ్రానైట్ అసోసియేషన్ నాయకులు తిరుపతి గౌడ్ తోపాటు మరికొందరు నాయకులు ఎదురుపడ్డారు.
ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లాచ్చాక వ్యాపార సంబంధాలు మెరుగుపడ్డాయని, గ్రానైట్ వ్యాపారం పుంజుకునే అవకాశం ఉందని గ్రానైట్ అసోసియేషన్ నేతలు చెప్పారు. ఆ వెంటనే సంజయ్ స్పందిస్తూ ‘‘మరి కనీసం ప్రెస్ మీట్ పెట్టి మోదీకి థ్యాంక్స్ అయినా చెప్పారా? ఎందుకు చెప్పలేదు? గత 20 ఏళ్లుగా మీరంతా బీఆర్ఎస్ కు దోచిపెడుతూనే ఉన్నారు. మీలో కొందరు వ్యాపారాల కోసం రాజకీయాలను వాడుకుంటున్నరు.
కొందరు రాజకీయ నాయకులై వ్యాపారాలను పెంచుకుంటరు. వచ్చిన సొమ్ముతో రాజకీయాలు చేస్తారన్నారు. మాలోంటోళ్లను ఓడగొట్టాలని చూస్తరని చురకలంటించారు. గ్రానైట్ అసోసియేషన్ నుండి బండి సంజయ్ కోట్ల రూపాయల లంచం తీసుకున్నాడంటూ గతంలో జరిగిన దుష్ప్రచారాన్ని ఈ సందర్భంగా సంజయ్ వారి వద్ద ప్రస్తావించారు. ఏనాడైనా మీరు నాకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? తాను గెలిచిన తరువాత కూడా మీలో ఒక్కరైనా తన దగ్గరకు వచ్చి కనీసం బొకే అయినా ఇచ్చారా? ఒక్క స్వీటు ముక్క కూడా తిన్పించలేదన్నారు.
.కానీ బయట మాత్రం కొందరు తనకు 700 కోట్ల రూపాయలు ఇచ్చానని నిందలేస్తుంటే మీ అసోసియేషన్ కనీసం ఖండించలేదన్నారు. పైగా వందల కోట్ల రూపాయలను బీఆర్ఎస్ కు దోచి పెట్టి ఆ పార్టీని ఇంకా సాదుతున్నరని మండిపడ్డారు. కానీ సమాజానికి సేవ చేయాలనే ఆలోచన మాత్రం మీకు రావడం లేదని వ్యాఖ్యానించారు. ఆ తరువాత అక్కడి నుండి చింతకుంట చెరువు వద్దకు వెళ్లి గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడుతుండగా మల్లిఖార్జున మధుతో కలిసి కొందరు గ్రానైట్ వ్యాపారులు అక్కడిక వచ్చారు.
మళ్లీ వాళ్లను ఉద్దేశించి గ్రానైట్ అసోసియేషన్ కేంద్రానికి చెల్లించింది రూ. 300 కోట్లకు మించి లేదన్నారు. బయటకు వెళ్లి మాత్రం వెయ్యి కోట్లు ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. గ్రానైట్ కటింగ్ మిషన్ దుకాణాల నుండి సభ్యత్వం పేరుతో ఒక్కో దుకాణం నుండి రూ.10 లక్షల నుండి రూ.50 లక్షల వరకు గ్రానైట్ అసోసియేషన్ వసూలు చేసిందన్నారు.
దాదాపు 350 నుండి 500 షాపుల వరకు డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం ఉందన్నారు. మరి ఆ సొమ్మును ఏం చేశారు? సమాజానికి ఏమైనా సేవ చేశారా అని ప్రశ్నించారు. గణేశ్ పండుగ సందర్భంగా గల్లీగల్లీలో గణేష్ మండపాలు పెడతారు కనీసం తట్టెడు మట్టి పోశారా? కరెంట్ బిల్లులైనా కట్టారా? అధికారులు, పోలీసులు సొంతంగా ఖర్చు పెట్టుకుని తిండి తింటూ రాత్రింబవళ్లు డ్యూటీ చేస్తారన్నారు.
అట్లాంటి వాళ్లకు భోజన, మంచి నీళ్ల సదుపాయాలైనా కల్పించారా? అవేమీ చేయరన్నారు. మరి వసూలు చేసిన కోట్ల రూపాయలను ఏం చేశారు? తీస్తా… ఆ లెక్కలన్నీ త్వరలోనే బయటకు తీస్తానన్నారు. దీంతో ఖంగుతిన్న ఖంగుతిన్న గ్రానైట్ అసొసియేషన్ నాయకులు సమాజానికి సేవ చేస్తామని అందులో భాగంగానే గణేష్ నిమజ్జనం సందర్భంగా క్రేన్లను ఏర్పాటు చేశామని చెప్పారు.
త్వరలోనే మోదీకి సైతం థ్యాంక్స్ చెబుతామని, గ్రానైట్ అసోసియేషన్ పేరుతో సమాజానికి సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ ఎవ్వరికీ పైసలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే పరిస్థితిని కల్పిస్తానని, సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు చేయాలని సూచిస్తూ ముందుకు సాగారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ భూ భారతి ఆర్టీలపై కీలక ప్రకటన.. ఆర్డీవో, తహసిల్దార్లకు ఆదేశాలు..!
-
Unispace : హైదరాబాద్ లోనే గృహ రూపకల్పన, భవన పరిష్కారాల కోసం.. ఆసియాలోనే అతిపెద్ద కేంద్రం అపర్ణ యునిస్పేస్..!
-
District collector : జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ కీలక ఆదేశాలు.. ఆ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి..!
-
Suryapet : వినాయక నిమజ్జనానికి 1500 మందితో పోలీసు బందోబస్తు..!
-
Suryapet : పెన్ పహాడ్ ఎంపీఓ గా బాధ్యతలు స్వీకరించిన బీస్ రాజేశ్వర్.. ఎవరో తెలుసా..!









