TG News : భారీగా తగ్గనున్న ఎంపిటిసి స్థానాలు.. స్థానిక సంస్థల లేటెస్ట్ అప్డేట్..!

TG News : భారీగా తగ్గనున్న ఎంపిటిసి స్థానాలు.. స్థానిక సంస్థల లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూలైలో ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు ముందుగా నిర్వహించిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో గ్రామాలలో హడావిడి ప్రారంభమైంది.
అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎంపిటిసి స్థానాల సంఖ్య భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖ తుది జాబితా కూడా ఖరారు చేసింది. ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల అమలుకు అవసరమైన కసరత్తులో భాగంగా ఈ ప్రక్రియను సిద్ధం చేసింది. దాంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య ఫైనల్ చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నం అయింది.
ఇప్పటి వరకు తెలంగాణలో 5815 ఎంపిటిసి స్థానాలు ఉన్నాయి. కాగా ఈసారి ఆ సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇటీవల కొత్త మున్సిపాలిటీలు ఏర్పడటం, కార్పొరేషన్ సమీపంలోని గ్రామాలను విలీనం చేయడం, మేడ్చల్ జిల్లా మొత్తం అర్బన్ ప్రాంతంగా మార్చడం, ఔటర్ రింగ్ రోడ్డు లోపల మండలాలన్నీ మున్సిపాలిటీగా మార్చడంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది.
MOST READ :
-
Alumni : 56ఏళ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనం..!
-
Agriculture : వ్యవసాయ రంగంలో AI టెక్నాలజీ.. రైతులకు ఇక పండుగ..!
-
ACB : రేషన్ కార్డు కోసం లంచం.. పట్టుకున్న ఏసీబీ..!
-
TG News : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు నగరా.. షెడ్యూల్ ఎప్పుడంటే..!
-
TG News : స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ..!
-
Rythu Bharosa : రైతుల ఖాతాలలో రూ.48 వేలు ఒకేసారి.. రైతుభరోసా మీకు రాలేదా.. వెంటనే ఇలా చేయండి..!









