TOP STORIESBreaking Newsజాతీయంహైదరాబాద్

UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!

UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

డిజిటల్ లావాదేవీలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది డిజిటల్ లావాదేవీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా భారతదేశంలో కూడా డిజిటల్ లావాదేవీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కొనుగోళ్లతో పాటు ఈఎంఐ (EMI) చెల్లింపులు సైతం డిజిటల్ లావాదేవీల ద్వారానే కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉండగా యూపీఐ కొత్త నిబంధనలు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ఇతర డిజిటల్ యాప్ లకు మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. దాని ప్రకారం మీ ఖాతాలలోని డబ్బు ప్రతినెల 14 రోజులు బ్లాక్ చేయబడుతుంది. ఇది మీ ప్రయోజనం కోసమే తీసుకున్న చర్య అంటూ RBI వివరించింది.14 రోజులు ముగిసిన తర్వాత మీ డబ్బు మీ ఖాతాకు తిరిగి వస్తుంది.

చాలామంది ఇన్సూరెన్స్, ఈఎంఐ వంటి వాటికి చెల్లించడానికి తమ బ్యాంకు ఖాతాలలో డబ్బులు ఆదా చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు దానిని ఇతర కారణాలవల్ల ఖర్చు చేయాల్సి వస్తుంది. దానివల్ల వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తుంది. కాబట్టి దీనిని పరిష్కరించడానికి ఇన్సూరెన్స్, ఈఎమ్ఐ వంటి డబ్బు చెల్లించడానికి ఖాతాలలో జమ చేసిన డబ్బులు బ్యాంకు వినియోగదారు సమ్మతితో 14 రోజులు బ్లాక్ చేస్తారు.

ఇన్సూరెన్స్ లేదా EMI చెల్లింపు కంపెనీలు ఆ 14 రోజుల్లో డబ్బులు ఉపసంహరించుకుంటే ఖాతాదారు నుంచి EMI చెల్లింపులు జరుగుతాయి. చెల్లింపు జరగకపోతే తిరిగి యధావిధిగా మీ ఖాతాలో డబ్బులు జమవుతాయి.

Similar News : 

  1. UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!
  2. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో వెంటనే ఇది ఆఫ్ చేయండి.. లేదంటే మీ ఎకౌంటు ఖాళీ..!
  3. Upi Payments | ప్రతిరోజు ఎక్కువ సార్లు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా..? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..!
  4. Phonepe, Gpay, Paytm : ఫోన్ పే, గూగుల్ పే, పేటియమ్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారా.. అయితే ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..!

మరిన్ని వార్తలు