Vaibhavam : వైభవం సినిమా విజయోత్సవ సంబురాలు.. సందడి చేసిన సినిమా యూనిట్..!
Vaibhavam : వైభవం సినిమా విజయోత్సవ సంబురాలు.. సందడి చేసిన సినిమా యూనిట్..!
సూర్యాపేట, మనసాక్షి :
కుటుంబ విలువలు స్నేహబంధం తెలిపే చిత్రం వైభవం అని ప్రముఖ సీనియర్ న్యాయవాది టేకులపల్లి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఏసియన్ తిరుమల మల్టీప్లెక్స్ లో విజయవంతంగా నడుస్తున్న రమాదేవి క్రియేషన్స్ బ్యానర్ పై ఈనెల 23న విడుదలైన వైభవం సినిమా విజయోత్సవాల సంబురాల సందర్భంగా సినిమా యూనిట్ సభ్యులతో కలిసి సెకండ్ షో సినిమాలో కేక్ కటింగ్ చేసి మాట్లాడారు.
చిత్ర రంగంలో సూర్యాపేటకు చెందిన ప్రముఖ న్యాయవాది రమాదేవి నిర్మాతగా వారి కుమారులు రుత్విక్ హీరోగా,సాత్విక్ దర్శకులుగా ఉండటం విశేషం అన్నారు. సూర్యాపేట వారిచే నిర్మితమైన వైభవం సినిమాను అందరూ ఆదరించి విజయవంతం చేయాలని ఆయన కోరారు.
అనంతరం సినీ దర్శకులు సాత్విక్ మాట్లాడుతూ సమాజంలో అడుగంటుతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పటిష్టత కోసం, స్నేహం ముసుగులో కార్పొరేట్ సంస్థలు చేసే మోసాలను పసిగట్టి సమాజంలోనూ యువత అటువంటి చెడు మార్గంలో ప్రయాణించకుండా అద్భుత ప్రదర్శన అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా సినీ హీరో రుత్విక్, హీరోయిన్ ఇక్రా ఇడ్రిసి, తారాగణం చక్రి, కల్లూరి లక్ష్మీనరసింహ ప్రసాద్ లకు యాజమాన్యం ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొంపెల్లి లింగయ్య, సీనియర్ న్యాయవాదులు జే శశిధర్, గుండ్రాల అశోక్, మీలా రమేష్, రెడ్ క్రాస్ అధ్యక్షురాలు ఇరిగి కోటేశ్వరి, డాక్టర్ దుర్గాబాయి,అజయ్ కుమార్,రజిని,ఎల్గూరి పాండు, కల్లూరి నాగయ్య, శోభ, చకిలం ఫణి కుమార్, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Seeds : నకిలీ విత్తనాల నియంత్రణకు టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో జాయింట్ యాక్షన్ టీం..!
-
Miryalaguda : బాలింత మృతి సంఘటనపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. మిర్యాలగూడ శిరీష హాస్పిటల్ పై మెజిస్టేరియల్ విచారణ..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్.. ఫోన్ కు మెసేజ్ కూడా.. ఎప్పుడంటే..!
-
WhatsApp DP : వాట్సప్ డిపి మార్చాలనుకుంటున్నారా.. మంచి లోకేషన్, అందంగా ఉండేలా కొత్త ఫీచర్..!









