Cricket : గ్రామస్థాయి నుండి ఆంద్రా క్రికెట్ జట్టుకు వల్లాల దర్శన్ రాజు ఎంపిక..!
Cricket : గ్రామస్థాయి నుండి ఆంద్రా క్రికెట్ జట్టుకు వల్లాల దర్శన్ రాజు ఎంపిక..!
రామసముద్రం, మనసాక్షి
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం తిరుమలరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వల్లాల దర్శన్ రాజు ఆంధ్ర అసోసియేషన్ టి20 క్రికెట్ మ్యాచ్ జట్టుకు ఎంపికయ్యారు. ఒక గ్రామ స్థాయి నుండి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జట్టులో స్థానం పొందిన దర్శన్ రాజును కుటుంబ సభ్యులు, స్నేహితులు, క్రీడాకారులు అభినందిస్తున్నారు.
హైదరాబాదులో మూడు రోజులపాటు జరిగిన టి 20 క్రికెట్ మ్యాచ్ లో దర్శన్ రాజు అత్యంత ప్రతిభ చూపించారు. అత్యంత ప్రతిభ చూపిన ఈ యువకుడిని టి20 క్రికెట్ నిర్వహకుల నుండి అభినందనలు అందుకున్నారు.
హైదరాబాదు నుండి శుక్రవారం స్వగ్రామమైన
తిరుమలరెడ్డిపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా దర్శన్ కు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, యువకులు ఘన స్వాగతం పలికి సంబరాలు జరుపుకున్నారు.
రామసముద్రం మండలం పెద్ద కురప్పల్లి పంచాయతీ, తిరుమలరెడ్డిపల్లికి చెందిన శంకర్ రాజు, వసుంధరమ్మల మనుమడు వేణు గోపాల్ రాజు, జ్యోతి దంపతుల కుమారుడు వల్లాల దర్శన్ రాజు విద్యా బ్యాసం ఎల్ కె జి నుండి ఐదు వరకు చెంబకూరు శ్రీసాయి విద్యానికేతన్, ఎనిమిది నుంచి పది వరకు మట్లవారిపల్లి జడ్పీ హైస్కూల్ విద్యాభ్యాసాన్ని పొందారు.
ఇంటర్ తిరుపతి ఎన్నారై జూనియర్ కాలేజి, జ్ఞానాంబికా కాలేజిల్లో చదివారు. ప్రస్తుతం పలమనేరు సమీపంలోని మదర్ తెరిసా ఇన్స్ట్యూట్ లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఈ యువకుడిని చిన్నప్పటి నుండి క్రికెట్లో రాణించేలా
తండ్రి వేణు గోపాల్ రాజు, బాబాయ్ విశ్వనాధ్ రాజు ప్రోత్సహించారు.
తండ్రి, బాబాయ్ ఇద్దరు పాత్రికేయులుగా పనిచేస్తున్నారు. ఇతని పెదనాన్న వి. శ్రీధర్ సీఐ గా అనంతపురం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారు.ఇదే కుటుంబానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభారాజు, పెద్ద నాన్న గిరిధర్ రాజు మేనత్త లలిత అక్కలు లావణ్య రమ్య, పెద్దనాన్నసుధాకర్ రాజు అండదండలతో క్రీడల పట్ల దర్శన్ ఆసక్తి చూపుతున్నారు.
బాబాయ్, పెదనాన్నలు మేన మామ చరణ్ రాజు వారి స్ఫూర్తి తో చిన్నప్పటి నుంచి క్రికెట్ పై మక్కువ పెంచుకున్నారు. రామసముద్రం మండలంతో పాటు సరిహద్దులోని కర్ణాటక, మదనపల్లి,పుంగనూరు ప్రాంతాల్లో ఎక్కడైన క్రికెట్ పోటీలు జరిగిన దర్శన్ వెళ్ళేవాడు. దీంతో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అందించడంతో దర్శన్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యారు.
ఇటీవల అన్న మయ్య జిల్లా పీలేరులో జరిగిన అండర్ 19 క్రికెట్ పోటీలకు ఎంపికై హైదరాబాద్ లో జరిగిన పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచి విజయానికి కృషి చేశారు. అత్యంత ప్రతిభ చూపిన దర్శన్ రాజును సెలెక్షన్ కమిటీ ఆంధ్ర టీ 20 జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపారు . సెప్టెంబర్ 19 నుంచి 22 వరకు నేపాల్ లో జరగనున్న రాష్ర్ట స్థాయి టీ 20 పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
హైదరాబాద్ నుంచి సొంత గ్రామం తిరుమలరెడ్డిపల్లికి దర్శన్ రాజు మాట్లాడుతూ సీఐ శ్రీధర్ పెదనాన్న, తండ్రి వేణుగోపాల్ రాజు, చిన్నాన్న విశ్వనాథ్ రాజు మేన మామ సాయి చరన్ రాజు (బబ్లు )ఆవణి విజయ్ కుమార్ రాజు సహయ సహకారాలతో క్రికెట్లో రాణిస్తానని చెప్పారు. క్రికెట్ పరంగా రాష్ట్ర, దేశ స్థాయిలో రాణించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు దర్శన్ తెలిపారు.
LATEST UPDATE :
నిరుద్యోగులకు శుభవార్త.. 2280 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!
Srisailam : శ్రీశైలం కు మళ్లీ భారీ వరద.. 10 గేట్ల ఎత్తివేత..!









