Vande Bharath : సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్.. కోచ్ ల పెంపు .. టైమింగ్స్ మార్పు.. ఎప్పటినుంచో తెలుసుకుందాం.. !

Vande Bharath : సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్.. కోచ్ ల పెంపు .. టైమింగ్స్ మార్పు.. ఎప్పటినుంచో తెలుసుకుందాం.. !

హైదరాబాద్ మనసాక్షి :

తిరుపతి వెళ్లే వారికి మరింత సౌకర్యవంతంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి (20701), తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు(20702) ఏప్రిల్ 10వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చాయి .

 

సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ రైలుకు మంచి ఆదరణ లభిస్తుంది. ప్రస్తుతం వేసవిలో సెలవులు కావడం వల్ల తిరుపతి వెళ్లే వారికి సౌకర్యవంతంగా ఉండడం వల్ల వందే భారత్ రైలు కు అనుకున్న దానికంటే ఎక్కువ ఆదరణ లభిస్తుంది.

 

దాంతో ప్రస్తుతం వందే భారత్ రైలులో 7 ఏసీ కోచ్ లు ఒక ఎగ్జిక్యూటివ్ ఏసి కోచ్ తో 8 ఉన్నాయి. వాటిని 16కు పెంచుతూ కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కోచ్ ల పెంపు తో పాటు టైమింగ్స్ లో కూడా మార్పు చేశారు. అదనపు కోచ్ లు టైమింగ్స్ ను ఈనెల 17వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ లో పేర్కొన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి, రైల్వే శాఖ మంత్రి కి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు.

వందే భారత్ రైలు ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది. కానీ ఈనెల 17వ తేదీ నుంచి పావుగంట ఆలస్యంగా అంటే ఉదయం 6:15 నిమిషాలకు బయలుదేరుతుంది. ఈ మార్పు అన్ని స్టేషన్లకు కూడా వర్తిస్తుంది.

మార్పు చేసిన వందే భారత్ టైమింగ్స్ :

సికింద్రాబాద్ లో ఉదయం 6.15 గంటలకు వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ బయలుదేరుతుంది. నల్గొండకు ఉదయం 7 .30 గంటలకు, గుంటూరుకు 9 .40 గంటలకు, ఒంగోలుకు 11.10 గంటలకు, నెల్లూరుకు మధ్యాహ్నం 12 .30 గంటలకు చేరుకుంటుంది. తిరుపతికి 2. 30 గంటలకు చేరుకుంటుంది .

తిరుపతి – సికింద్రాబాద్ ట్రైన్ నెంబర్ (20702) మధ్యాహ్నం 3:15 గంటలకు బయలుదేరుతుంది. రాత్రి 11. 30గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

 

నాలుగు స్టేషన్లోనే స్టాప్ :

సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ కేవలం నాలుగు స్టేషన్లలో మాత్రమే ఆగనున్నది నల్గొండ , గుంటూరు, ఒంగోలు, నెల్లూరు రైల్వే స్టేషన్లలో మాత్రమే ఆగనున్నది.

 

ట్రైన్ చార్జీల ధరలు ఈ విధంగా ఉన్నాయి :

సికింద్రాబాద్ – తిరుపతి రూ. 16 80 (చైర్ కార్ టికెట్)
సికింద్రాబాద్ – నెల్లూరు రూ. 1250
సికింద్రాబాద్ – ఒంగోలు రూ. 10 75
సికింద్రాబాద్ – గుంటూరు రూ. 865
సికింద్రాబాద్ – నల్గొండ రూ. 4 70

సికింద్రాబాద్ – తిరుపతి రూ. 3080 (ఎగ్జిక్యూటివ్ చైర్)

సికింద్రాబాద్ – నెల్లూరు రూ. 2455
సికింద్రాబాద్- ఒంగోలు రూ. 2045
సికింద్రాబాద్- గుంటూరు రూ.1620
సికింద్రాబాద్ – నల్గొండ రూ. 900