వెంకటాపురం : అఖిలపక్ష నాయకుల అరెస్టు

వెంకటాపురం : అఖిలపక్ష నాయకుల అరెస్టు

వెంకటాపురం , మనసాక్షి.

ములుగు జిల్లా వెంకటాపురం మండలం బుధవారంనాడు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ములుగుజిల్లా పర్యటన సందర్భంగా.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు మండలంలోని ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం జరిగింది.

 

ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ. ములుగుజిల్లా పర్యటనకు విచ్చేయుచున్న మంత్రి కల్వకుంట్ల.తారక రామారావు పర్యటన సందర్బంగా జిల్లా లోని ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయటం అన్యాయం అక్రమం అని సిపిఐ ములుగు జిల్లా కార్యదర్శి తోట. మల్లికార్జునరావు అన్నారు.

 

ఒక మంత్రి జిల్లా పర్యటనకు వస్తుంట్టే వారినికలిసి ఎన్నో సమస్యలు చెప్పుకుందామని ఆశ పడేవారికి నిరాశే ఎదురైందని అన్నారు.ప్రతీ పేదవానికి ఒక 5. సెంట్ల భూమికావాలని లేక ఇల్లు.పోడుభూములకు పట్టలు కావాలని ధరణిలో వున్న లోపాలను సరిద్దిద్ది నూతన పట్టాదార్ పాస్ పుస్తకాలు కావాలని ప్రజా సమస్యలను మంత్రికి చెప్పుకోవాలని ఆశపడి.

ALSO READ : పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ లోకి చేరేందుకు లైన్ క్లియర్, అదే బాటలో మరి కొంతమంది..!

 

దరకాస్తూలు ఇవ్వాలని ఎదురు సూస్తున్న ప్రజా నాయకులను అరెస్టు సేస్తే. ఇక పేదవారి సమస్యలు ఏ లినవారికి తెలిసేది ఎట్లా అని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ పద్దతి మంచిది కాదని అఖిలపక్షలను పిలిచి గ్రామీణ స్థాయిలో సమావేశాలు జరిపినట్లయితే కొంతవరకైనా ప్రబుత్వానికి సమస్యలు తెలిసే అవకాశం ఉందని వారు అబిప్రాయన్ని వ్యక్తం చేశారు.

 

ఇది జరగని నాడు ప్రతిపక్షాలకు పోరాటమే శరణ్యమని.అధికారంవుంది కదాఅని ఈ రకంగా సేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.అరెస్టు చేయబడిన వారిలో సిపిఐ ములుగుజిల్లా కార్యదర్శి తోట. మల్లికార్జునరావు,కుమ్మరి. శ్రీను,కాంగ్రెస్ నాయకులు చిడెం.మోహన్ రావు,సయ్యద్ హుస్సేన్, పల్నాటి,ప్రకాష్ రావు, ఆదివాసి నాయకులు పూనెం.సాయి, బిజెపి నాయకులు తదితరులు ఉన్నారు