పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ లోకి చేరేందుకు లైన్ క్లియర్, అదే బాటలో మరి కొంతమంది..!

పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ లోకి చేరేందుకు లైన్ క్లియర్, అదే బాటలో మరి కొంతమంది..!
ఖమ్మం , మన సాక్షి :
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు లకు కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు లైన్ క్లియర్ అయిందని సమాచారం. కొంతకాలంగా వారు ఇరువురు బి.ఆర్.ఎస్ నుంచి వెళ్లి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. వారి అనుచరగణంతో భారీ ఎత్తున సభలు నిర్వహించారు. వార ఏ పార్టీలో చేరుతారు..? అనే విషయంతో పాటు కొత్త పార్టీ పెడతారనే చర్చలు కూడా సాగడంతో తెలంగాణ ప్రజల చూపు వారిపై పడింది.
కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వారితో చర్చలు జరిపినా వారు కొంతకాలం వేచి చూశారు. అదేవిధంగా వారితో బిజెపి నాయకులు సైతం పార్టీలోకి ఆహ్వానించి చర్చలు జరిపారు. అంతేకాకుండా ఇటీవల కోదండరాం సైతం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన సభకు వెళ్లి చర్చలు జరిపారు.
ఎట్టకేలకు వారు ఇరువురు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అనుచర ఘనంతో నిర్వహించిన చర్చల కారణంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం.
ALSO READ : Congress : తెలంగాణ కాంగ్రెస్ లో ఈ నెలాఖరులోగా ఆ.. 60 మందితో జాబితా..?
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , జూపల్లి కృష్ణారావు లతోపాటు వారి అనుచరులకు కూడా రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. రాహుల్ గాంధీ అమెరికా పర్యటన ముగించుకుని ఇండియాకు వచ్చిన అనంతరం ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నహాలు చేయనున్నట్లు తెలిసింది. ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఈనెల 20వ తేదీ కానీ 25వ తేదీ గాని ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ALSO READ : Train journey : రైలు ప్రయాణికులు.. ఇది అస్సలు మర్చిపోకండి..!
ఇరువురి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా తెలంగాణలో కాంగ్రెస్ నేతలు రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్నారు .
ఆ ఇరువురి నేతల చేరికతో మరింత బలం చేకూరుతుందని వారితోపాటు మరికొంతమంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి