Narayanpet : బస్ డిపో వద్ద భారీ భద్రత.. ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ డాక్టర్ వినీత్..!
టీజీఎస్ ఆర్టీసీ జే ఏ సి సమ్మె నేపథ్యంలో నారాయణపేట పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపోను గురువారం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ క్షేత్రస్థా యిలో సందర్శించి, భద్రతా ఏర్పాట్లను అక్కడి పరిస్థితు లను సమీక్షించారు.

Narayanpet : బస్ డిపో వద్ద భారీ భద్రత.. ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ డాక్టర్ వినీత్..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
టీజీఎస్ ఆర్టీసీ జే ఏ సి సమ్మె నేపథ్యంలో నారాయణపేట పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపోను గురువారం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ క్షేత్రస్థా యిలో సందర్శించి, భద్రతా ఏర్పాట్లను అక్కడి పరిస్థితు లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్య తో మాట్లాడి బస్సుల రాకపోక లు డిపో వద్ద నెలకొన్న తాజా పరిస్థితులను అడిగి తెలుసు కున్నారు.
బందోబస్తులో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమ త్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో విధులకు హాజరయ్యే డ్రైవ ర్లు ఇతర సిబ్బంది ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి పోలీసు శాఖ తరపున పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
ప్రజా రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేసినా, లేదా ప్రభుత్వ ఆస్తులైన బస్సులకు నష్టం కలిగించినా సహించేది లేదని హెచ్చరించారు. చట్టాన్ని అతిక్రమించి ఆందోళన లకు దిగేవారిపై, విధులను అడ్డుకొనే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకో వాలని అక్కడి అధికారుల ను ఆదేశించారు.
జిల్లా లోని రెండు డిపోలలో పరిస్థితి శాంతియుతంగా కొనసాగు తోంది, ఆర్టీసీ విధులకు హాజ రయ్యే ఉద్యోగులు ఎవరు భయపడకుండా తమ విధు లకు హాజరు కావాలని అందుకు పోలీస్ శాఖ రక్షణ కల్పిస్తుంది అని తెలిపినారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా రవాణా సౌకర్యా లు కొనసాగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ తో పాటు ఎస్ బి ఎస్సై నరేష్, ఎస్సై లు వెంకటేశ్వ ర్లు, రాజు పోలీసు సిబంది ఉన్నారు.









