Congress : తెలంగాణ కాంగ్రెస్ లో ఈ నెలాఖరులోగా ఆ.. 60 మందితో జాబితా..?

Congress : తెలంగాణ కాంగ్రెస్ లో ఈ నెలాఖరులోగా ఆ.. 60 మందితో జాబితా..?

మనసాక్షి, హైదరాబాద్ :

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తుంది. నాయకులు రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు జాతీయ నేతలు కూడా అండగా ఉంటున్నారు.

 

ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో తెలంగాణతో పాటు జాతీయ నేతలు కూడా ఆనందంలో ఉన్నారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి అధికారమే లక్ష్యంగా పనిచేయాలని భావిస్తున్నారు.

 

కర్ణాటకలో ఉపయోగించిన మాత్రమే తెలంగాణలో కూడా ఉపయోగించి విజయం సాధించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. కేవలం రాష్ట్రస్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా తెలంగాణపై దృష్టి పెట్టారు.

 

తెలంగాణలో రాబోయే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ముందస్తుగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

 

Also Read : Whatsapp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్ స్క్రీన్ షేరింగ్.. ఎలా చేయాలో తెలుసుకుందాం..!

 

తెలంగాణలో సర్వే :

తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్వేలు కొనసాగుతున్నాయి. మొత్తంగా ఐదు సర్వేలను జాతీయ నేతలు చేపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలో సర్వేలు కొనసాగుతున్నట్లు సమాచారం.

 

ఇప్పటికే కొన్ని సర్వేలు పూర్తికాగా ఈనెలాఖరులోగా మరికొన్ని సర్వేలు కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. సర్వేల ఆధారంగా అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి .

 

ముందస్తుగా 60 మందితో జాబితా ..?

ఈ నెలాఖరులోగా ఆ… 60 మంది జాబితా కాంగ్రెస్ పార్టీ ముందస్తు ప్రణాళికల్లో భాగంగా సర్వేలు పూర్తికాగానే అభ్యర్థుల టికెట్లను కూడా ఖరారు చేసే అవకాశాలు లేకపోలేదు. కర్ణాటకలో ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించి విజయం సాధించిన విషయం తెలిసిందే.

 

Also Read : Railway Stations : విదేశాలకు వెళ్లేందుకు ఫ్లైటే కాదు.. భారత్ లో ఏడు రైళ్లు..! అవి ఎక్కడో తెలుసుకుందాం..!

 

కాగా తెలంగాణలోని 119 స్థానాల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేందుకు అభ్యర్థులను ఖరారు చేస్తుంది . అందులో భాగంగా సర్వేల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా 40 నుంచి 60 స్థానాలలో అభ్యర్థులను ఈనెలాఖరులోగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.

 

తెలంగాణలో అభ్యర్థులను ప్రకటించే అంశం రాష్ట్రస్థాయి నేతలకు వదలకుండా టికెట్ల ఖరారు.. అంతా జాతీయ స్థాయి నేతలే చూస్తున్నట్లు సమాచారం. సర్వేల ఆధారంగా అభ్యర్థులను ముందస్తుగా జాతీయస్థాయి నేతలే ప్రకటించనున్నారు.

 

రాష్ట్రస్థాయి నేతల సలహాలు సూచనలు మాత్రమే అభ్యర్థుల ప్రకటన సమయంలో తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ గ్రూపు తగాదాలకు చెక్ పెట్టేందుకు జాతీయ నాయకులే అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం .

 

కాగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయా నియోజకవర్గాల్లో పనిచేస్తున్న వారికే టికెట్లు వస్తాయని భావిస్తున్నారు.