Nalgonda : నల్గొండ లో ఘనంగా భగీరథ మహర్షి జయంతి..!
పట్టుదలకు మారుపేరు భగీరథ మహర్షి అని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో భగీరథ మహర్షి జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

Nalgonda : నల్గొండ లో ఘనంగా భగీరథ మహర్షి జయంతి..!
నల్లగొండ, మన సాక్షి :
పట్టుదలకు మారుపేరు భగీరథ మహర్షి అని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో
భగీరథ మహర్షి జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కఠోర దీక్ష, పట్టుదలతో గంగను దివి నుండి భువికి తీసుకువచ్చి ప్రపంచాన్ని సస్యశ్యామలం చేసిన మహనీయుడని అన్నారు.
ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, భవితరాలకు ఆ స్ఫూర్తిని అందించాల్సిన అవసరం ఉందన్నారు. సబ్బండ వర్గాల ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు చేరవేయడం ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ అన్నారు. పనిలో అవరోధాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని కృషి చేస్తే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని భగీరథ మహర్షిని ఉదాహరణగా చెబుతారని అన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో సగర సంఘo తరఫున పని కల్పిస్తామన్నారు.
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. గృహజ్యోతి, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్, రేషన్ బియ్యం వంటి సంక్షేమ పథకాలు . సగరం సంగం లోఅర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చూస్తామన్నారు. అర్హులైన సగరులు పథకాల కోసం ప్రజావాణిలో దరఖాస్తులు చేసుకోవాలని, జిల్లా స్థాయిలో పరిశీలించి, అర్హులకు ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే నిర్మాణరంగంలో పనిచేస్తున్న సగరులు, కార్మికులు లేబర్ కార్యాలయంలో నమోదు చేసుకుంటే అనుకోని సంఘటనల సమయంలో సహాయం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు.
సగరo సంఘం తరఫున అర్హుల జాబితా అందిస్తే వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సహకరిస్తామని పేర్కొన్నారు.
రెవిన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, సమాచార శాఖ సహాయ సంచాలకులు యు. వెంకటేశ్వర్లు సగర,బీసీ వెల్ఫేర్ అధికారి సంజీవయ్య, సగరం సంగం అధ్యక్షులు రవికుమార్ సగర, రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్లెట్ల మారయ్య సగర, జిల్లా కార్యదర్శి కరుణాకర్ సగర, తదితరులు మాట్లాడారు. స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి , గృహ నిర్మాణ శాఖ టిడిపి రాజ్ కుమార్, కలెక్టర్ కార్యాలయ ఏవో మోతిలాల్, బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది, జిల్లా సాగర సంగం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా సగర సంగం ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.









