Big Breaking : ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా..!
Big Breaking : ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా..!
మన సాక్షి :
తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించిన ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి కూడా వాయిదా పడింది. ఈ కేసు తదుపరి విచారణ జూలై నెలకి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
ఓటుకు నోటు కేసు విచారణ సుప్రీంకోర్టు నుంచి బోపాల్ హైకోర్టు బెంచ్ కు బదులు చేయాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తోపాటు మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, మహబూబ్ అలీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని కేసులో నిందితుడిగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.
కేసు విచారణ మే మూడో తారీకు వాయిదా వేసింది. కాగా ఈ మేరకు పిటిషన్ పై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల ధర్మాసనం.. ప్రతివాదులు కౌంటర్ ఫైల్ చేయకపోవడంతో కేసు విచారణ జూలై నెలకు వాయిదా వేసింది.
ALSO READ :
WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు..!
Modi : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..!
Big Breaking : నాలుగు కంటైనర్ల లో రూ. 2 వేల కోట్ల పట్టివేత..!
Telangana : తెలంగాణ మహిళలకు సర్కార్ శుభవార్త.. ఏకంగా లక్ష రూపాయలు..!









