Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

Big Breaking : నాలుగు కంటైనర్ల లో రూ. 2 వేల కోట్ల పట్టివేత..!

Big Breaking : నాలుగు కంటైనర్ల లో రూ. 2 వేల కోట్ల పట్టివేత..!

మన సాక్షి :

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు కీలక దశకు వచ్చాయి. చిన్నపాటిది ఏ అవకాశం ఉన్న వినియోగించుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. పోలీసుల తనిఖీలు కూడా భారీ బందోబస్తు మధ్య నిర్వహిస్తున్నారు. గతంలో కంటే ఈసారి నోట్ల కట్టలు పోలీసులకు ఎక్కువగా దొరికాయి. గురువారం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో నాలుగు కంటైనర్లలో తరలిస్తున్న రెండు వేల కోట్ల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు.

అనంతపురం జిల్లా పామిడి మండలం గజరాంపల్లి గ్రామం వద్ద రోడ్డుపై వెళ్తున్న నాలుగు కంటైనర్లను పోలీసులు ఆపారు. తనిఖీలలో భాగంగా పోలీసులు కంటైనర్లను తనిఖీ చేయగా ఒక్కొక్క కంటైనర్లలో 500 కోట్ల రూపాయల చొప్పున నాలుగు కంటైనర్లలో 2000 కోట్ల రూపాయలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎన్నికల కోడ్ కారణంగా ఆ వాహనాలను పోలీసులు తనిఖీ చేయాల్సి వచ్చింది.

కాగా ఈ డబ్బు రిజర్వ్ బ్యాంక్ కు చెందిన నగదుగా పోలీసులు పేర్కొంటున్నారు. అయితే ఈ నాలుగు వాహనాలకు ఎస్కార్ట్ గా కర్ణాటక పోలీసులు ఉన్నట్లు తెలిసింది. అయితే కంటైనర్ లోని డబ్బులు, రికార్డులను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా నగదుకు సంబంధించిన రికార్డులన్నీ సక్రమంగా ఉండడంతో ఈ వాహనాలను పోలీసులు పంపించేశారని తెలుస్తోంది. నగదు మొత్తం ఆర్బిఐ కొచ్చి నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ALSO READ : 

Climbing Stairs : మీరు ప్రతిరోజు మెట్లు ఎక్కి దిగుతున్నారా..? అయితే ఇది తెలుసుకోవాల్సిందే.. కొత్త అధ్యాయంలో నిజాలు..!

Telangana : తెలంగాణ మహిళలకు సర్కార్ శుభవార్త.. ఏకంగా లక్ష రూపాయలు..!

Bjp : తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ

మరిన్ని వార్తలు