Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణసంక్షేమం

Telangana : తెలంగాణ మహిళలకు సర్కార్ శుభవార్త.. ఏకంగా లక్ష రూపాయలు..!

Telangana : తెలంగాణ మహిళలకు సర్కార్ శుభవార్త.. ఏకంగా లక్ష రూపాయలు..!

మన సాక్షి , వెబ్ డెస్క్:

తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త తెలియజేసింది. అంగన్వాడి కేంద్రాలలో టీచర్లకు, సహాయకులకు శుభవార్తను తెలియజేసింది.

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంక్షేమ పథకాలను జాతరలా ప్రవేశపెడుతుంది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పలు కీలక పథకాలను అమల్లోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం అంగన్వాడి కేంద్రాలలో టీచర్లకు, సహాయకులకు కూడా మరో శుభవార్తను తెలియజేసింది.

అంగన్వాడీ కేంద్రాలలో పనిచేసే రిటైర్మెంట్ వయసును 65 సంవత్సరాలుగా నిర్ణయిస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు సంబంధించిన వివరాలను ఏప్రిల్ 30 నాటికి పంపాలని అధికారులను కూడా ఆదేశించారు.

అంగన్వాడీ కేంద్రాలలో సిబ్బంది పుట్టిన తేదీని పాఠశాల బోనఫైడ్ సర్టిఫికెట్ గాని టి సి గాని మార్కుల మెమో ఆధారంగా గాని వివరాలను పంపాలని సూచించారు. ఈ ధ్రువీకరణ పత్రాలు లేకుంటే గుర్తింపు పొందిన జిల్లా వైద్యాధికారి చేసిన జారీ చేసిన నివేదిక లేదా వైద్య ధ్రువీకరణ పత్రం ఆధారంగా శిశు సంక్షేమ శాఖ కు ఆధారాలు ఇవ్వాలని సూచించింది.

అదేవిధంగా అంగన్వాడి టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులలో తెలియజేసింది. పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్లకు లక్ష రూపాయలు, మినీ అంగన్వాడి టీచర్లు, సహాయకులకు 50 వేల రూపాయలు ప్రోత్సాహకాల రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో పాటు వారందరికీ ఆసరా పింఛన్లు కూడా మంజూరు చేస్తామని ఇతరులలో స్పష్టం చేసింది.

ఈ ఉత్తర్వుల అనంతరం అంగన్వాడీ కార్యకర్తల ఆనందం వెల్లువేరుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితిని పదిలక్షలకు పెంచడం, పేద గృహాలకు ఉచిత విద్యుత్తును 200 యూనిట్ల వరకు అందజేయడం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేయడం.. ప్రస్తుతం అమలు చేస్తున్నది.

ALSO READ : 

BREAKING : తక్కువ మార్కులు వచ్చాయని కత్తులతో పొడుచుకున్న తల్లి కూతుర్లు..!

Telangana : కాంగ్రెస్ పార్టీ లో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి, తమ్ముడు జితేందర్ రెడ్డి..!

BIG BREAKING : అధికార పార్టీలోకి గోడలు దూకే నాయకులారా.. మీ పతనానికి చరమగీతం ముందుంది, మిర్యాలగూడలో ఫ్లెక్సీ పై మహిళల దాడి..!

బతుకుదెరువు కోసం వెళ్లి విగత జీవులయ్యారు

మరిన్ని వార్తలు