బతుకుదెరువు కోసం వెళ్లి విగత జీవులయ్యారు

డిగ్రీ పట్టాలు చేతపట్టుకొని జీవనోపాధి కోసం బెంగళూరుకు వెళ్లిన ముగ్గురు యువకులు అనుమానాస్పద స్థితిలో విగతజీవులైన హృదయ విధారకమైన ఘటన గురువారం మండలం లో చోటుచేసుకుంది. మృతుల కుటుంబసభ్యులు వివరాల మేరకు..

బతుకుదెరువు కోసం వెళ్లి విగత జీవులయ్యారు..!

రామసముద్రం, మనసాక్షి :

డిగ్రీ పట్టాలు చేతపట్టుకొని జీవనోపాధి కోసం బెంగళూరుకు వెళ్లిన ముగ్గురు యువకులు అనుమానాస్పద స్థితిలో విగతజీవులైన హృదయ విధారకమైన ఘటన గురువారం మండలం లో చోటుచేసుకుంది. మృతుల కుటుంబసభ్యులు వివరాల మేరకు..

మండలంలోని కనగాని గ్రామానికి చెందిన అమరణారాయన కుమారుడు శశికుమార్ 25,గజ్జిగంగణపల్లెకు చెందిన రామన్న కుమారుడు సుబ్రహ్మణ్యం 24,పేడ రాజు పల్లెకు చెందిన భాస్కర్ కుమారుడు లోకేష్ 25 లు డిగ్రీలు పూర్తి చేసుకొని గత నాలుగునెలల క్రితం ఉద్యోగం కోసం బెంగళూరుకు వెళ్లారు.వీరు ముగ్గురు గత నాలుగు నెలలుగా ఉద్యోగ అన్వేషణ లో ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం వీరు ముగ్గురు బెంగళూరులోని కె ఆర్ పుర రైల్వే సమీపంలో మృతి చెందినట్లు కుటుంబీకులకు కర్ణాటక పోలీసులు సమాచారం అందించారు .

 

ఇది విన్న మృతుల కుటుంబీకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే యువకుల మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. మృత దేహాలను రామసముద్రం తీసుకురావడానికి బాధిత కుటుంబ సభ్యులు బెంగళూరుకు వెళ్లినట్లు తెలిసింది.వైసీపీ మండలకన్వీనర్ నందకిషోర్ రెడ్డి మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేసారు. వారి కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం తరుపున వారికి తనవంతు సాయం చేస్తామని అన్నారు.