Miryalaguda : మిర్యాలగూడలో మేడే వేడుకల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క..!
కార్మికుల హక్కులు, సంక్షేమాని కై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని (మే డే) పురస్కరించుకొని శుక్రవారం నల్గొండ జిల్లా, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మే డే వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు .

Miryalaguda : మిర్యాలగూడలో మేడే వేడుకల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క..!
కార్మికుల హక్కులు, సంక్షేమాని కై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని (మే డే) పురస్కరించుకొని శుక్రవారం నల్గొండ జిల్లా, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మే డే వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు .
అంతకుముందు ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ మే 1 న మే డే వేడుకలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటారని, 145 సంవత్సరాలకు పూర్వం చికాగో నగరంలో కార్మికులు 8 గంటలు పని చేయాలని కోరుతూ ఉద్యమించారని, ఆ సందర్భంలో కార్మికులపై చేసిన దాడి లో రక్తం చిందిన సందర్భాలకు గుర్తుగా మే ఒకటో తేదీన కార్మిక దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారని తెలిపారు.
భారత దేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాయకత్వంలో కార్మికులు అణగారిన వర్గాల వారి హక్కుల రక్షణ, అభివృద్ధికి కృషి చేశారని, కార్మికుల సంక్షేమంపై వారి హక్కుల గురించి బ్రిటిష్ పరిపాలనలోని వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ దృష్టికి తీసుకువెళ్లారని ,భారత దేశంలో సైతం కార్మికులు 8 గంటల పని చేసేలా కౌన్సిల్ వద్ద పోరాటం చేశారని తెలిపారు.
అనంతరం స్వాతంత్రం సాధించుకున్న భారత దేశంలో రాజ్యాంగంలో కార్మికుల హక్కులు, చట్టాల రూపంలో కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దే అని అన్నారు. పురుష కార్మికులతో పాటు ,మహిళలకు కూడా మొట్టమొదటిసారిగా మెటర్నటీ లీవ్ ను ఏర్పాటు రాజ్యాంగం ద్వారా పొందుపరిచారని, అలాగే ఇంట్లో పని చేసే వారికి కూడా మెటర్నరీ లీవ్ ఇచ్చే విధంగా హక్కులు కల్పించారని తెలిపారు.
స్వాతంత్రం రాకముందు వైస్రాయ్ కౌన్సిల్ లో హిందూ కోడ్ బిల్ పొందుపరిచేందుకు పోరాటం చేశారని ,1955 హిందూ వివాహ చట్టం, 1956 హిందూ వారసత్వ చట్టం ద్వారానే మహిళలకు హక్కులతో పాటు, వివాహ హక్కు, ఆస్తి హక్కు వంటివి కల్పించబడ్డాయని తెలిపారు. కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికుల హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుందని అన్నారు.
స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ,స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు ఉన్నారు.
అంతకుముందు ఉపముఖ్యమంత్రి వద్ద పిఆర్ఓగా పనిచేసిన మిర్యాలగూడ పట్టణానికి చెందిన మధుసూదన్ ఇటీవల గుండె పోటుతో అకాల మరణం చెందగా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మిర్యాలగూడ పట్టణానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి కి శాసనసభ్యుల క్యాంపు కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పుష్ప గుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.









