Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్జాతీయం

Modi : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..!

Modi : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..!

మన సాక్షి :

ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 13వ తేదీన సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికలు కూడా జరగనున్నాయి. జూన్ 4వ తేదీన ఫలితాలు కూడా వెలువలడనున్నాయి. కాగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది.

వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు అన్ని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయగా బిజెపి, టిడిపి, జనసేన కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలుచోట్ల అనేక బహిరంగ సభలలో కూడా ఆయన ప్రసంగించారు. మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేయడంతో పాటు బహిరంగ సభలో ఎన్నికల ప్రచారం కూడా కలిసి చేస్తున్నారు.

ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. ఆ రాష్ట్రంలో మిత్రపక్షాలతో కలుపుకొని వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.

అదేవిధంగా తెలంగాణ ఎన్నికలపై కూడా ఆయన స్పందించారు. తెలంగాణలో బిజెపికి మంచి ఫలితాలు రాబోతున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే విషయాన్ని ప్రధాని చెప్పడంతో ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాల్లో మార్పు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ALSO READ : 

WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు..!

Big Breaking : నాలుగు కంటైనర్ల లో రూ. 2 వేల కోట్ల పట్టివేత..!

Climbing Stairs : మీరు ప్రతిరోజు మెట్లు ఎక్కి దిగుతున్నారా..? అయితే ఇది తెలుసుకోవాల్సిందే.. కొత్త అధ్యాయంలో నిజాలు..!

Telangana : తెలంగాణ మహిళలకు సర్కార్ శుభవార్త.. ఏకంగా లక్ష రూపాయలు..!

మరిన్ని వార్తలు