MLC Electron : వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. జిల్లా కలెక్టర్..!

MLC Electron : వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. జిల్లా కలెక్టర్..!
నల్గొండ , మన సాక్షి :
నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరంగల్- ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడాతూ ఈ నెల 3 నుండి 10 వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.
ఈనెల 8, 9 తేదీలలో ప్రభుత్వ సెలవు దినాలలో ఎలాంటి నామినేషన్లు స్వీకరించడం జరగదని, ఈనెల 11న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని , ఈనెల 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4:00 వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని కలెక్టర్ వివరించారు .ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు తాను రిటర్నింగ్ అధికారిగా, నల్గొండ రెవిన్యూ అదనపు కలెక్టర్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనున్నట్లు తెలిపారు.
నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గాను రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ముఖ్యంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయినా లేదా క్లరికల్ సమస్యలకు సంబంధించి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం, చట్ట ప్రకారం పాటించాల్సిన నియమ నిబంధనలన్నిటిని అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, తప్పకుండా పాటించాలని కోరారు. నామినేషన్ల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు నియమ నిబంధనలు అన్నింటిని తెలుసుకునేందుకు తనతో పాటు, అదనపు కలెక్టర్, సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆమె వెల్లడించారు.
ముఖ్యంగా అభ్యర్థుల అఫిడవిట్ సమర్పణ, అన్నేక్సర్ 26, ఫోటోల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు.ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని 100 మీటర్లు, 200 మీటర్ల పరిధిలో పాటించాల్సిన నిబంధనాలను నిర్ధారించడం జరిగిందని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, అందరూ ఈ నిబంధనలను పాటించాల్సిందిగా ఆమె కోరారు. వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ పరిధిలో మొత్తం 200 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ముసాయిదా జాబితా ప్రకారం 24905 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ వెల్లడించారు.
అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ర్యాలీలు, సమావేశాలు నిర్వహించేందుకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, ముందస్తు అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తే ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు నల్గొండ సమీపంలోని అర్జాల బావి వద్ద ఉన్న మార్కెటింగ్ గోదాంలో ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ విషయమై ఎన్నికల కమిషన్ కు ప్రతిపాదనలు పంపించనున్నట్లు ఆమె తెలిపారు. అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతుల ఖాతాలలో భరోసా డబ్బులు.. ఎప్పటినుంటే.. లేటెస్ట్ అప్డేట్
-
Good News : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. రూ.5లక్షలు పొందే పథకం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!
-
సూర్యాపేట జిల్లాలో అఘోరి ప్రత్యక్షం.. యువకులతో ఘర్షణ, తల్వార్ తో దాడి..!
-
District collector : కలెక్టరేట్ లో ప్రజావాణి రద్దు.. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..!









