TOP STORIESBreaking Newsజాతీయం

Srishailam : శ్రీశైలంలో 859 అడుగులకు చేరిన నీటిమట్టం.. కొనసాగుతున్న వరద.. LATEST UPDATE

Srishailam : శ్రీశైలంలో 859 అడుగులకు చేరిన నీటిమట్టం.. కొనసాగుతున్న వరద.. LATEST UPDATE

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

శ్రీశైలం జలాశయ నీటిమట్టం గంట గంటకు పెరుగుతోంది. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణ నదిపై ఉన్న జలశయాల నుంచి దిగువకు భారీగా నీరు విడుదలవుతుంది. దాంతో పాటు తుంగభద్ర ప్రాజెక్టు నుంచి కూడా భారీగా వరద దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో శ్రీశైలం జలాశ నీటిమట్టం గంటకు పెరుగుతుంది. శ్రీశైలం జలాశయానికి 2,23, 866 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది.

జలాశ పూర్తిస్థాయి సామర్థ్యం 885 అడుగులకు గాను (శుక్రవారం ఉదయం 10. 40 గంటలకు) ప్రస్తుతం 859 అడుగులకు చేరింది. జలాశయంకు 2,23, 866 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా 31,784 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215.81 టీఎంసీల నేటికీ గాను ప్రస్తుతం 102.89 టీఎంసీల నీరు ఉంది.

ఇదిలా ఉండగా నాగార్జునసాగర్ నీటిమట్టం కూడా మెల్లగా పెరుగుతుంది నాగార్జునసాగర్ జలాశ నీటిమట్టం పూర్తిస్థాయి సామర్థ్యం 590 అడుగులకు గాను ప్రస్తుతం 505 అడుగులకు చేరింది.

సాగర్ జలాశానికి 29,569 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో కొనసాగుతుంది. కాగా జలాశయం నుంచి 6990 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది. సాగర్ జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలకు గాను ప్రస్తుతం 123.34 టీఎంసీల నీరు ఉంది.

ఇవి కూడా చదవండి : 

SRISHAILAM : శ్రీశైలంకు కృష్ణ, తుంగభద్ర నుంచి భారీ వరద.. గంట గంటకు పెరుగుతున్న నీటిమట్టం, వారం రోజులు కొనసాగితే..!

రాష్ట్ర సరిహద్దుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా ఎస్పీ ఆదేశం

KCR : ఈస్ట్ మన్ కలర్ లా తెలంగాణ బడ్జెట్, ఏ రంగానికి ప్రాధాన్యత లేదు.. అసెంబ్లీ మీడియా పాయింట్ లో కేసిఆర్..!

Miryalaguda : భీమవరం, సూర్యాపేట ప్రధాన రహదారికి మరమత్తులు.. దగ్గరుండి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్..!

మరిన్ని వార్తలు