Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Narayanpet : రేపటి నుంచి నీటి సరఫరా బంద్.. ఏఏ ప్రాంతాల్లో అంటే..!

Narayanpet : రేపటి నుంచి నీటి సరఫరా బంద్.. ఏఏ ప్రాంతాల్లో అంటే..!

నారాయణపేట టౌన్, మన సాక్షి :

నారాయణపేట జిల్లాలో రేపటి నుంచి రెండు రోజులపాటు మంచినీటి సరఫరా బందు కానున్నది. సోమవారం సాయంత్రం 6:00 గంటల నుండి 2025 నవంబర్ 25 మంగళవారంసాయంత్రం 6:00 గంటల వరకు 24 గంటలు నీటి సరఫరా నిలిపి వేయడం జరుగుతుందని కార్యనిర్వహక అభియాంత మిషన్ భగీరథ గ్రిడ్ డివిజన్ మహబూబ్నగర్ అధికారి డి శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

నేషనల్ హైవే రోడ్డు విస్తరణలో భాగంగా క్రిస్టియన్ పల్లీ , మహబూబ్నగర్ దగ్గర 1200ఎంఎం పైపులైన్ మార్చుతున్నట్లు ఆయన తెలిపారు. ఇట్టి పని పూర్తి కావడానికి సుమారు 24 గంటల సమయం పడుతుందని, నీటి సరపరా 24 గంటలు ఆపివేయడం జరుగుతుందనీ అన్నారు.

రాంరెడ్డి గూడెం నీటి శుద్ధికరణ ప్లాంట్ నుండి వెళ్ళే మహబూబ్నగర్ పురపలకకు పాక్షికంగా,మన్యంకొండ నీటి శుద్దకరణ ప్లాంట్ నుండి వెల్లె మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలోని 258 గ్రామాలకు , నారాయణపేట, మక్తల్ దేవరకద్ర పురపాలికలకు పూర్తి గా నీటి సరఫరాలో అంతరాయము ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజలందరూ సహకరించగలరని ఆయన కోరారు.

MOST READ : 

  1. Miryalaguda : బిజెపి హెచ్చరిక.. దేవాలయ, పర్యావరణ పరిరక్షణకై పోరాటానికి సిద్ధం..!

  2. Rythu Bharosa : రైతు భరోసా కు వేళాయే.. రైతుల ఖాతాలలో ఎప్పుడంటే..!

  3. Nalgonda : నల్గొండ జిల్లాలో భారీ చోరీ కేసు.. నాలుగు లక్షల నగదు పోలీసులు స్వాధీనం..!

  4. RRR : త్రిబుల్ ఆర్ కు భూములు ఇచ్చేది లేదు.. పంచాయతీ కార్యాలయంలో అధికారులను బంధించిన రైతులు..!

మరిన్ని వార్తలు