Nalgonda : బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పని చేయాలి.. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..!
Nalgonda : బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పని చేయాలి.. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..!
నల్లగొండ, మన సాక్షి:
బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా పోలీస్ అధికారులు పనిచేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా నలుమూలల 30 ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 30 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు.
బాధితుల సమస్యలు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకొవాలని అన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని అన్నారు.
ఫిర్యాదుదారునికి భరోసా,నమ్మకం కలిగించాలని తెలిపారు. ఎవరైనా చట్టవ్యతిరకమైన చర్యలు చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు.
MOST READ :
-
Paddy Centers : కాంటాలు కావు, లారీలు లేవు, కుప్పలుగా ధాన్యం .. కొనేదెప్పుడో.. ఆందోళనలో రైతులు..!
-
Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడంటే.. మంత్రి తుమ్మల స్పష్టం.. బిగ్ అప్డేట్..!
-
Job Mela : నిరుద్యోగులకు భారీ ఉద్యోగ ఉపాధి అవకాశం.. మెగా జాబ్ మేళా.. అర్హత ఏదైనా ఉద్యోగం..!
-
TG News : పేద, మధ్యతరగతి ప్రజలకు కన్నీళ్లు తెప్పించే.. ఉల్లి ధరలు ఎంతో తెలుసా..!
-
Gold Price : పసిడి పరుగు.. ఈరోజు తులం ఎంతో తెలుసా..!









