Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

BANK : ప్రపంచంలోనే అత్యుత్తమ వినియోగదారుల బ్యాంక్‌ ఏదంటే..!

BANK : ప్రపంచంలోనే అత్యుత్తమ వినియోగదారుల బ్యాంక్‌ ఏదంటే..!

ముంబై:

భారతదేశపు అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2025 సంవత్సరానికి గాను ‘ప్రపంచంలోనే అత్యుత్తమ కన్జూమర్ బ్యాంక్’ అవార్డును గెలుచుకుంది. ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఈ మేరకు ప్రకటించింది. విశ్లేషణ, ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ ఫైనాన్స్ నిపుణులు, విశ్లేషకులు, బ్యాంకర్ల అభిప్రాయాల ఆధారంగా ఈ ఎంపిక జరిగింది.

గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ తన వార్షిక ‘వరల్డ్స్ బెస్ట్ బ్యాంక్’ కార్యక్రమంలో భాగంగా, ఐఎంఎఫ్/ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల సందర్భంగా 2025 అక్టోబర్ 18న వాషింగ్టన్ డీసీలో ఈ అవార్డును ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టికి ప్రదానం చేయనున్నారు.

అదే మా లక్ష్యం..

ఈ సందర్భంగా ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి మాట్లాడుతూ.. తమ విలువైన ఖాతాదారులకు, అంకితభావంతో పనిచేసే ఉద్యోగులకు, నమ్మకం ఉంచిన భాగస్వాములందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వినియోగదారులకు మెరుగైన అనుభూతిని అందించడమే తమ వృద్ధి వ్యూహానికి కీలకమని ఆయన పేర్కొన్నారు.

ఆన్-బోర్డింగ్‌ను సరళీకరించడం, ప్రాంతీయ భాషల్లో వాయిస్ బ్యాంకింగ్‌ను ప్రవేశపెట్టడం, 24/7 డిజిటల్ సపోర్ట్ అందించడం వంటి చర్యలతో గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని వినియోగదారులకు మరింత నిరాటంకమైన, సమ్మిళితమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమన్నారు.

అలాగే, ఏఐ (AI) సామర్థ్యాలతో హైపర్-పర్సనలైజ్డ్ సేవలను అందిస్తూ, ఆమ్ని ఛానల్ ఎంగేజ్‌మెంట్ మోడళ్లను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ మ్యాగజైన్ ‘గ్లోబల్ ఫైనాన్స్’ నాలుగు దశాబ్దాలుగా ఈ అవార్డులు అందజేస్తోంది. ఎడిటోరియల్ విశ్లేషణలు, అంతర్జాతీయంగా ఫైనాన్షియల్ నిపుణుల అభిప్రాయాల ఆధారంగా 150కి పైగా దేశాలకు చెందిన సంస్థలను ఈ పురస్కారం కోసం ఎంపిక చేస్తారు.

MOST READ :

  1. TG News : యూరియా, ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు..!

  2. Ramky: అప్పులన్నీ తీర్చేశాం.. రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వెల్లడి..!

  3. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సస్పెండ్..!

  4. Suspended : అక్రమ ఆస్తులలో సంచలనం.. నల్గొండ సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్..!

  5. TG News : తెలంగాణలో నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ.1000.. దరఖాస్తు ఇలా..!

మరిన్ని వార్తలు