Breaking NewsTOP STORIESviralజాతీయం

Viral Video : ఏం.. టీచరమ్మ రా బాబు.. క్లాస్ రూమ్ లోనే పిల్లలతో.. (వీడియో)

Viral Video : ఏం.. టీచరమ్మ రా బాబు.. క్లాస్ రూమ్ లోనే పిల్లలతో.. (వీడియో)

మన సాక్షి , వెబ్ డెస్క్ :

ఇటీవల కాలంలో ఉపాధ్యాయులు పాఠశాలలో, తరగతి గదిలో వీడియోస్ వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఉపాధ్యాయులు ఆ వృత్తికే మచ్చ తెస్తున్నారు.

తాజాగా ఓ సంఘటన నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఓ ప్రభుత్వ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలు నేలపై పడుకుని విద్యార్థులతో మసాజ్ చేయించుకుంటున్న సంఘటన సంచలనంగా మారింది. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో చోటుచేసుకుంది.

జైపూర్ లోని కర్తర్ పూర్ లో ఉన్న ప్రభుత్వ హయ్యర్ ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయురాలు నేలపై పడుకుని ఇద్దరు విద్యార్థులచే మసాజ్ చేయించుకుంటుంది. ఆమె పడుకొని ఉండగా విద్యార్థులు తొక్కుతున్నారు.

కాగా ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారడంతో ఉపాధ్యాయురాలు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోను పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్పందించారు. వైరల్ అయితున్న వీడియో తాను కూడా చూశానని టీచర్ అనారోగ్యంతో ఉండవచ్చని, తన పాదాలకు మసాజ్ చేయమని పిల్లలను అభ్యర్థించి ఉండవచ్చని ఆమె చెప్పుకొచ్చారు.

నిజా నిజాలు తెలియాలంటే విచారణ జరుపుతామని ఆమె స్పష్టం చేశారు. ఈ సంఘటనపై విద్యాశాఖ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదని తెలిసింది.

 

మరిన్ని వార్తలు