Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

WhatsApp Group : ఆదర్శంగా నిలుస్తున్న వాట్సాప్ గ్రూప్.. ఆపదలో ఆదుకుంటున్న వాట్సాప్ గ్రూప్ సభ్యులు..!

ఆపదలో ఉన్నవారిని అక్కున చేర్చుకుని ఆదుకోవడంలో లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఫౌండేషన్ నిర్వాహకులు బ్రహ్మదేవర నరేష్, బట్టిపల్లి వెంకన్న లు తెలిపారు.

WhatsApp Group : ఆదర్శంగా నిలుస్తున్న వాట్సాప్ గ్రూప్.. ఆపదలో ఆదుకుంటున్న వాట్సాప్ గ్రూప్ సభ్యులు..!

సూర్యాపేట, మనసాక్షి

ఆపదలో ఉన్నవారిని అక్కున చేర్చుకుని ఆదుకోవడంలో లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఫౌండేషన్ నిర్వాహకులు బ్రహ్మదేవర నరేష్, బట్టిపల్లి వెంకన్న లు తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ తల్లాడ చందన్ కుమారుడు హయాన్ చంద్ర (7)హైపర్ అటిజంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు.

మాటలు రాక, ఆహారం తీసుకోక బాలుడి పరిస్థితి ఆందోళనకరంగా మారి అల్లాడిపోతున్నాడు. చికిత్సకు డబ్బులు లేక ఆ కుటుంబం ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని నకిరేకల్ చెందిన లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ వారు ఆదివారం సూర్యాపేట కృష్ణాకలనీలో వారు అద్దె కు ఉంటున్న ఇంటికి వెళ్లి అబ్బాయి తల్లిదండ్రులు చందన్-మంజుల కు రూ.22,200/- నగదు అందించి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మదేవర నరేష్, బట్టిపల్లి వెంకన్న పాల్గొన్నారు.

లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ ప్రతినిధి నరేష్ మాట్లాడుతూ.. కొంతమంది మిత్రులు ఒక వాట్సప్ గ్రూప్ గా ఏర్పడి ప్రతి నెల 200 రూ జమ చేస్తూ వచ్చిన డబ్బులతో ఇలా ఇబ్బందుల్లో ఉన్నవారికి సాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా తన కుమారుని ఇబ్బందిని గుర్తించి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్ధిక సహాయం చేసిన లిటిల్ సోల్జర్ ఫౌండేషన్ నిర్వాహకులకు హయన్ చంద్ర తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

MOST READ 

మరిన్ని వార్తలు