Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్రప్రదేశ్Breaking Newsరాజకీయం

TDP : వైభవంగా 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..!

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల టిడిపి పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, కూటమి నేతలు, పాల్గొన్నారు.

TDP : వైభవంగా 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..!

రామసముద్రం, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల టిడిపి పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, కూటమి నేతలు, పాల్గొన్నారు. 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు అభిమానులకు పచ్చిపెట్టారు, టిడిపి పార్టీఅధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఎన్ టి ఆర్ 9 నెలల్లో పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు.

ఆయన పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని ఎన్ టి ఆర్ పాలనలో రూ. 2కే కిలోబియ్యం, జనతా వస్త్రాలు, పేదలకుకిలో బియ్యం, పటేలు, పట్వారి వ్యవస్థను రద్దు చేయడం వంటి సంక్షేమ పథకాలు, విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారని వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లను తొలిగా ప్రారంభించారని స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి లకు 20శాతం మహిళలకు 9 శాతం రిజర్వేషన్లు విద్య, ఉద్యో గా ల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనతా టిడిపి సొంతంఅని మైనారిటీల అభివృద్ధికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారని ఎన్ టి ఆర్ అడుగు జాడల్లో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ పయనిస్తున్నారని వారి సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్, మాజీ జడ్పీటీసీ మునివెంకటస్వామి, మాజీ మండలటిడిపి అధ్యక్షులు కొండూరు నారాయణరెడ్డి, గజ్జల సీతప్ప, రెడ్డి వారి ప్రదీప్ రెడ్డి,రైస్ మిల్ వెంకటరమణ రెడ్డి,ఇంజం వెంకటరమణ, హరినాథ్ రెడ్డి, ఆన్సర్ బాషా, గణేష్ ఆర్ టీసీ, చెంగారెడ్డి, బండ్ల జనార్ధన, జావెద్, రాంమూర్తి, శ్రీనాథ్ రెడ్డి, గుట్టపాల్యం తిప్పన్న, వాల్మీకి కిట్ట, జేసీబీ విశ్వనాథ్ రెడ్డి, రెడ్డెప్ప నాయుడు, నడింపల్లె రమేష్, అరవ శీనప్ప, నాగరాజ, పాలు డైరీ శీనప్ప ,ఎల్ శివ గుంతలపేట శంకర, పవన్,ఐ టి డి పి అశోక్, మణి, కైకల కృష్ణ మోహన్ టిడిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు