WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ట్రిక్.. ఫోన్ చూడకుండానే మెసేజ్ చేసింది ఎవరో చెప్పొచ్చు..!

WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ట్రిక్.. ఫోన్ చూడకుండానే మెసేజ్ చేసింది ఎవరో చెప్పొచ్చు..!
మన సాక్షి :
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. చాలా ఈజీగా మెసేజ్ లు సెండ్ చేసుకోవడానికి వాట్సప్ లో వినియోగిస్తున్నారు ఎక్కువమంది. ఇప్పుడు వాట్సప్ మెసేజ్ లు వాడని వారు లేరు. ఆండ్రాయిడ్, ఐఫోన్ ఏ ఫోన్ లోనైనా కూడా ప్రతి ఒక్కరికి వాట్సప్ లు ఉన్నాయి. ఈ యాప్ ల ద్వారా ఈజీగా మెసేజ్ లు, ఫోటోలు సెండ్ చేసుకుంటున్నారు.
అలాంటిది ప్రతిసారి మెసేజ్ ఎవరు చేశారో చూసుకోవడం ఇబ్బందిగా ఉంటే చిన్న ట్రిక్ ఫాలో అయితే సరిపోతుంది. మన కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నవారు ఎవరు మెసేజ్ చేశారో..? ఫోన్ చూడకుండానే చెప్పవచ్చును. అలా ఒక్కొక్క కాంటాక్ట్ కు ఒక్కొక్క రింగ్ టోన్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. అది చాలా సింపుల్…
ఆండ్రాయిడ్ ఫోన్లో ఎలా సెట్ చేసుకోవాలి..?
ఆండ్రాయిడ్ ఫోన్ లో వాట్సాప్ ఓపెన్ చేసి చిట్స్ ట్యాబ్ లోకి వెళ్ళాలి. అక్కడ మీరు ఏ కాంటాక్ట్ కు అయితే రింగ్టోన్ సెట్ చేయాలని అనుకుంటున్నారో ఆ కాంటాక్ట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత వారి ప్రొఫైల్లోకి వెళ్లాలి. కింద నోటిఫికేషన్ దగ్గరకు వెళ్లాలి. నోటిఫికేషన్ ఆప్షన్ ను ఓపెన్ చేయాలి. అందులో రింగ్ టోన్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. మీరు రెండు రకాలుగా రింగ్టోన్ పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. ఫోన్లో ఉన్న రింగ్టోన్లను వాడుకోవచ్చు. లేదా మనమే ఏదైనా రింగ్టోన్ కూడా సెట్ చేసుకోవచ్చును.
ఐఫోన్ లో ఎలా..?
ఐఫోన్ లో కూడా వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేయాలి. చిట్స్ ట్యాబ్ ఓపెన్ చేయాలి. మీరు ఎవరి కాంట్రాక్టుకు అయితే రింగ్టోన్ సెట్ చేయాలనుకుంటున్నారో వారి కాంట్రాక్టు సెలెక్ట్ చేయాలి. అక్కడ వాల్ పేపర్ అండ్ సౌండ్స్ ని క్లిక్ చేయాలి. అక్కడ అలర్ట్ టోన్ ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయాలి. నీకు కావలసిన రింగ్టోన్ సెట్ చేయాలి. ఇకపై ఎప్పుడైనా వాట్సప్ కు మెసేజ్ వస్తే ఫోన్ చూడకుండానే ఎవరో తెలుసుకోవచ్చును.
MOST READ NEWS :
-
Nalgonda : నల్గొండలో జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల అనుమానితులు.. ఎయిర్ గన్స్ గంజాయి చాక్లెట్స్, హుక్కా స్వాధీనం చేసుకున్న పోలీసులు..!
-
Snacks : ఆరోగ్యం, రుచి… సాయంత్రం తినాల్సిన స్నాక్స్ ఇవే..!
-
Hair Fall : పురుషులకే బట్టతల ఎందుకు.. నివారణకు సూచనలు..!
-
Fake PassPort ; నకిలీ పాస్ పోర్టులతో విదేశి ప్రయాణానికి యత్నం.. పోలీసుల అదుపులో ఐదుగురు..!
-
Gold Price : బంగారం ధర డమాల్.. ఒకే రోజు రూ.21,300 తగ్గింది.. ఈ రోజు ఎంతంటే..!
-
Nalgonda : నల్గొండ జిల్లా మాడుగులపల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ ను ఢీకొట్టిన బొలెరో..!









