Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడు.. వారికి లేదా.. లేటెస్ట్ అప్డేట్..!

Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడు.. వారికి లేదా.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది. ఎకరానికి రెండు విడతలుగా 12,000 రూపాయలను పంట పెట్టుబడి సహాయం అందజేయనున్నది. 2025 జనవరి 26వ తేదీన ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
రైతులకు మార్చి 31వ తేదీలోగా పంట పెట్టుబడి సహాయం ఒక విడత 6000 రూపాయలను అందజేస్తామని హామీ ఇచ్చారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇప్పటివరకు కేవలం నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా సహాయం అందింది. మిగతా రైతులు ఇంకా రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు.
ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించిన విషయంలో రైతు భరోసాపై స్పష్టత లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం సీజన్ లో వరి నాట్లు వేయకముందే రైతులకు రైతు భరోసా అందజేస్తామని ప్రకటించారు. కానీ యాసంగి సీజన్లో 4 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు రైతు భరోసా అందజేస్తామనే విషయాన్ని మంత్రి ప్రకటించలేదు.
దాంతో నాలుగు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు రైతు భరోసా ఉందా..? లేదా..? అనేది తేలకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెండింగ్ లో ఉన్న రైతు భరోసా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. రాబోయే వానాకాలం సీజన్ వచ్చేనాటికి పెండింగ్‌లో ఉన్న రైతు భరోసా అందజేస్తారా..? లేక వానాకాలం సీజన్ రైతు భరోసా అందజేస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.
MOST READ :
-
WhatsApp : వాట్సాప్ లో కొత్త ఫీచర్ ఇక టైపింగ్ లేదు.. మాట్లాడొచ్చు..!
-
Subsidy Seeds : రైతులకు సబ్సిడీపై విత్తనాలు.. సద్వినియోపర్చుకోవాలి..!
-
UPI : గూగుల్ పే, ఫోన్ పే లావాదేవీల్లో కొత్త రూల్స్ వచ్చేశాయి.. పేమెంట్స్ ఫెయిల్ అయితే..!
-
BaBa Vanga : 2025 లో ఏం జరగబోతోంది.. బాబా వంగా చెప్పిన భవిష్యవాణి ఏంటి.. తీవ్ర ఆందోళన..!
-
TG News : రైతులకు శుభవార్త.. వారి ఖాతాలలో డబ్బులు జమ..!









