Panchayat Elections : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడంటే.. మంత్రి పొంగులేటి క్లారిటీ.. లేటెస్ట్ అప్డేట్..!

Panchayat Elections : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడంటే.. మంత్రి పొంగులేటి క్లారిటీ.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసి ఏడాదిపైగా గడిచింది. అయినా కూడా ప్రభుత్వం ఎన్నికలు చేపట్టడం లేదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలపై కీలకమైన అప్డేట్ వచ్చింది.
జూన్ చివరి వారంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మొదటగా జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు ఇస్తామని ఆ తర్వాత జూలై చివరి వారంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు కూడా చేస్తుందని పేర్కొన్నారు.
540 మండలాల్లో..
తెలంగాణలో ని 540 మండలాల పరిధిలో 12,966 గ్రామాలకు సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. వాటితో పాటు 1,14, 620 వార్డులకు వార్డు మెంబర్ల ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎన్నికలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ జాబితాను ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. గత ఎన్నికల్లో 535 మండలాల్లో 12,732 గ్రామాల్లో సర్పంచ్, 1,13,152 వార్డు సభ్యులకు ఎన్నికలు జరిగాయి. ఈసారి అదనంగా 5 మండలాలు 234 గ్రామాలు, 1468 వార్డులలో ఎన్నికలు కొత్తగా జరగనున్నాయి.
బీసీలకు 42 శాతం :
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే రిజర్వేషన్లలో మొత్తం 67 శాతానికి చేరుతుంది. అయితే సుప్రీంకోర్టు నిర్దేశించిన 50% పరిమితిని దాటుతుంది. ఈ బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతుంది. తద్వారా న్యాయ సమీక్ష నుండి రక్షణ పొందే అవకాశం ఉంది.
ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం పెరగనున్నది.
MOST READ :
-
Hot Water : ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం మంచిదేనా.. ఎవరు తాగకూడదో తెలుసుకుందాం..!
-
Vi : హజ్ యాత్రికులకు శుభవార్త.. వొడాఫోన్ ఐడియా అదిరిపోయే ప్లాన్లు..!
-
TG News : తెలంగాణలో మహిళలకు భారీ గుడ్ న్యూస్.. 50శాతం సబ్సిడీ..!
-
Rythu : రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఈరోజు సాయంత్రం లోగా ఖాతాలలో నగదు జమ..!
-
Farmer Registry : ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు.. ప్రారంభమైన ధరఖాస్తులు.. ఈ కార్డు ఉంటేనే పథకాలు..!









