Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయంసూర్యాపేట జిల్లా

Local Body Elections : పోలింగ్ జరుగుతుండగా హెడ్ కానిస్టేబుల్ కు గుండెపోటు..!

Local Body Elections : పోలింగ్ జరుగుతుండగా హెడ్ కానిస్టేబుల్ కు గుండెపోటు..!

మన సాక్షి :

తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత గ్రామపంచాయతీలకు గురువారం పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూలో నిల్చని ఓట్లు వేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల పోలింగ్ కేంద్రంలో డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ యాదగిరికి ఆకస్మికంగా గుండెపోటు వచ్చింది. వెంటనే అక్కడున్న పోలీసులు సిపిఆర్ చేసి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత సూర్యాపేటలోని ఆసుపత్రికి తరలించారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ :

నల్గొండ జిల్లా కొర్లపాడు లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు.

అదేవిధంగా చిట్యాల మండలం ఉరుమడ్ల లో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.

MOST READ 

  1. Local Body Elections : పల్లెలో కాక రేపుతున్న పంచాయతీ ఎన్నికలు.. జోరుగా పందేలు..! 

  2. INSURANCE : పోస్టల్ శాఖ భారీ గుడ్ న్యూస్.. రూ.750 చెల్లిస్తే 15 లక్షల ఇన్సూరెన్స్.. ఇలా సద్వినియోగం చేసుకోండి..! 

  3. EV : సరికొత్త ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ కారు.. గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..!

  4. SBI : ఎస్బిఐలో పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఉద్యోగాలు.. గడువు లేదు త్వరపడండి..!

మరిన్ని వార్తలు