Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

District SP : రాత్రివేళ అద్దంకి రహదారిపై వర్షపు నీటి ప్రవాహాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ..!

District SP : రాత్రివేళ అద్దంకి రహదారిపై వర్షపు నీటి ప్రవాహాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ..!

నల్లగొండ/మాడుగులపల్లి, మన సాక్షి:

జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. బుధవారం రాత్రి అద్దంకి-నార్కట్పల్లి హైవే మాడుగులపల్లి వద్ద గల రోడ్డు పైన ప్రవహించే నీటి ప్రవాహాన్ని ఎస్పీ పరిశీలించి మాట్లాడారు.

రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. మూసి,కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి అధిక ప్రవాహంతో వాగులు, వంకలు ఉదృతంగా ప్రహిస్తున్నాయని, అలాంటి సమయంలో ఎవరూ కూడా దాటే ప్రయత్నం చేయకూడదని అన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నీటి ప్రవాహం ఎక్కువగా ప్రవహించే వాగులు, వంకలు, కాలువల వద్ద హెచ్చరిక బోర్డులు,పోలీస్ పికెట్లు ఏర్పటు చేసి తగు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.

అదేవిధంగా శిథిలావస్థ మిద్దెలు, ఇళ్లల్లో, చెట్లకింద ఉండవద్దని సూచించారు. వాగులు వంకలు వద్ద అధిక నీటి ప్రవాహం ఉంటున్ననందు వాటిని దాటే ప్రయత్నం చేయరాదని అన్నారు. వ్యవసాయ పనులు దృష్ట్యా రైతులు పొలాల్లోకి వెళ్లి వర్షం కురుస్తున్న సమయంలో విద్యుత్ మోటార్లు వద్దకు వెళ్లి స్వీచ్ ఆన్ చేయవద్దని, రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోడ్ల పక్కన వున్న విద్యుత్ స్తంబాలు పట్టుకుంటే విద్యుత్ షాక్ కొట్టే ప్రమాదం ఉందన్నారు.

వాహన దారులు అతివేగంగా వెళ్లి ప్రమాదాలకు గురి కూడదని తెలిపారు. జిల్లా ప్రజలకు 24/7 ఎల్లప్పుడు పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుందని ఏవైనా ఇబ్బందులు కలిగితే వెంటనే 100 డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.ఎస్పీ వెంట మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు, యస్.బి సీఐ రాము తదితరులున్నారు.

MOST READ : 

  1. Suryapet : ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు.. సూర్యాపేట వాసికి ఆహ్వానం..!

  2. TG News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. విద్యా సంస్థలకు సెలవు, ఐటి ఉద్యోగులకు ఇంటి నుంచే పని, వారికి మాత్రం సెలవులు రద్దు..!

  3. Nalgonda : ఉదృతంగా మూసీ నది.. భీమారం కాజ్వే వద్ద పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!

మరిన్ని వార్తలు