2024 Google Top Search in World : 2024 గూగుల్ సెర్చ్ ట్రెండ్‌లో మొదటి స్థానం ఎవరిది.. ఏది ఎక్కువగా సెర్చ్ చేశారు..!
2024 Google Top Search in World : 2024 గూగుల్ సెర్చ్ ట్రెండ్‌లో మొదటి స్థానం ఎవరిది.. ఏది ఎక్కువగా సెర్చ్ చేశారు..!
మనసాక్షి:
కొత్త సంవత్సరం 2025లోకి అడుగుపెట్టబోతున్నాం. 2024 చరిత్రలో కలిసిపోతుంది. అయితే 2024లో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ ఎలా ఉంది. గూగుల్‌లో ప్రజలు ఏది ఎక్కువగా సెర్చి చేశారు. ప్రజలు దేని గురించి పెద్దగా ఆసక్తి చూపారు. అనే విషయాల గురించి గూగుల్ ఒక రిపోర్టును విడుదల చేసింది. 2024లో జరిగిన కీలక అంశాల విషయాఇకి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది జరిగినన్ని ఎన్నికలు గతంలో ఎప్పుడు జరిగి ఉండవు.
ప్రధానంగా చెప్పుకోవాలంటే ఇండియాతో పాటు అమెరికాలో కూడా ఎన్నికలు జరిగాయి . అలాగే ఈ ఏడాది ప్రపంచంలోని పలు దేశాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీంతో వాతావరణ సమతూల్యం దెబ్బందని పర్యావరణ శాస్ర్తవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలు పెరిగిపోయి.. వాతావరణ కాలుష్యం వల్ల సమతూల్యం దెబ్బతిందని .. భూతాపం పెరిగిందని వాతావరణ శాస్ర్తవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక గూగుల్‌లో అత్యధికంగా సెర్చి చేసింది మాత్రం అమెరికాలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల గురించి అని చెప్పుకోవాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అమెరికా రాజకీయాలపై పెద్ద ఆసక్తి చూపించారు. అలాగే ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తానని మంకుపట్టు పట్టిన బైడెన్ గురించి తర్వాత ఆయన పోటీ నుంచి నిష్ర్కమించే వరకు ప్రజలు ఆసక్తిగా గమనించారు.
అలాగే కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన హాట్‌హాట్ డిబెట్ గురించి ఆసక్తి చూపించారు. దీంతో పాటు అక్టోబర్ చివరి నుంచి నవంబర్‌లో ఫలితాలు వెలువడే వరకు యావత్ ప్రపంచం దృష్టి అంతా అమెరికా ఎన్నికలపైనే. ఇక రెండవ అంశం విషయానికి వస్తే పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల గురించి ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. చలిదేశంలో ఉండే ప్రజలు కూడా చెమటలు కక్కాల్సి వచ్చింది.
ఇక మూడో అంశం ఒలింపిక్స్ ఈ ఏడాది పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్ గురించి గూగుల్‌లో పెద్ద ఎత్తున సెర్చి జరిగింది. వివాదాదస్పదమైన ఒపెనింగ్ సెర్మనీ నుంచి ఇక అథ్లెట్ల పర్పార్మెన్స్ వరకు అలాగే ఈ సారి కొత్త గేమ్‌లను ప్రవేశపెట్టడం వరకు ప్రజలు ఆసక్తిగా గమనించారు. అటు తర్వాత వ్యక్తిగత విషయాలకు వస్తే ఎక్కువగా డొనాల్డ్ ట్రంప్ గురించి అన్వేషించారు.
ఆయన న్యాయపోరాటం, తర్వాత అమెరికా ప్రెసిడెన్షియల్ రేసేలో ఘన విజయం సాధించిన వరకు ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక వ్యక్తుల విషయానికి వస్తే ఎక్కువగా చర్చ జరిగింది మాత్రం కేట్ మిడిల్‌టన్ గురించే. ముఖ్యంగా ఈ ఏడాది రాయల్ డ్యూటీలకు ఆమ హాజరు కాకపోవడం పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అలాగే పెద్ద ఎత్తున ఊహాగానాలకు తావిచ్చింది.
ఇక వ్యక్తుల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సెర్చ్ చేసిన వారిలో మూడోస్థానంలో ఉన్నారు కమలాహారిస్. అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఎన్నికల్లో ఆమె బైడెన్‌ను పక్కకు నెట్టి ప్రెసిడెంట్ రేసులో నిలబడ్డారు. ఎన్నికలకు 100 రోజుల ముందు ఆమె అభ్యర్థిత్వం ఖరారు కావడం తదితర అంశాల గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా గమనించారు.
హారిస్ తర్వాత ఎక్కువ సెర్చి చేసిన వారి విషయానికి వస్తే నాలుగవ స్థానంలో అల్జిరియాకు చెందిన ఇమానే ఖెలిఫ్ నిలిచారు. ఆమె ఒలింపిక్స్‌లో విమెన్స్ వెల్టర్‌వెయిట్ మహిళా బాక్సింగ్‌లో ఇటలీకి చెందిన ఏంజిలా కారినిపై గోల్డ్ మెడెల్ సాధించారు. దీనిపై పెద్ద దుమారం చెలరేగింది. ఆమె స్ర్తీ కాదని, పరుషుడుని వివాదం చెలరేగింది. తర్వాత విచారణలో ఆమె స్ర్తీ అని తేలింది.
ఇక సినిమాల విషయానికి వస్తే డిస్నీ, ఫిక్సర్ ఎనిమిటెడ్ సీక్వెల్, ఇన్‌సైడ్ అవుట్ 2 లను ఎక్కువగా సెర్చ్ చేశారు. అలాగే డెడ్‌పూల్, వోవ్లోరైన్ సాల్ట్‌బర్న్‌వరుసగా రెండు, మూడు కేటగిరిలో నిలిచాయి. ఇక పాటల విషయానికి వస్తే కెండ్రీక్ లామర్ ట్రాక్ నాట్ లైక్ అస్, పాటను ఈ ఏడాది అత్యధికంగా సెర్చి చేశారు. ఈ ఏడాది మేలో విడుదలైన పవర్‌హౌస్ సాంగ్ పెద్ద వివాదానికి తెరతీసింది.
అటు తర్వాత రోస్అండ్ బ్రూనో మార్స్ ఏపీటి, క్రీపీ నట్స్ బ్లింగ్ బాండ్ బాండ్ బార్న్ రెండు, మూడు కేటగిరీల్లో ఈ పాటలు ఆక్రమించాయి. ఈ ఏడాది టాప్ 10 సెర్చ్ సాంగ్స్ విషయానికి వస్తే జపనీస్‌కు సింగ్ కోచ్చినో కెంటోకు సింగిల్ మై యోరోకోండే అనే పాట రికార్డు బద్దలు కొట్టింది. బిల్‌బోర్డు జపాన్ హాట్ 100లో నాలుగవ స్థానంలో నిలిచింది. అలాగే తమిళ గాయకుడు సాయి అభయాంకర్ పాడిన కాచీ సెరా పాటను ఈ ఏడాది అత్యధికంగా సెర్చి చేసిన పాటలో పదవి స్థానంలో నిలిచింది.
ఇక గేమ్స్ విషయానికి వస్తే న్యూయార్కు టైమ్స్‌గేమ్ వర్డ్ గేమ్ అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్లేయర్స్‌ను బాగా ఆకర్షించింది. మెదడుకు పదను ఇచ్చే గేమ్స్ పట్ల ప్రజలు ఆసక్తి చూపించారు. జపనీస్ డెవలపర్ పాకెట్ పెయిర్ పేరుపై పాల్ వరల్డ్‌ను విడుదల చేశారు దీనికి మంచి స్పందన లభించింది. ఇక గేమ్స్ విషయానికి వస్తే జపాన్, చైనా, స్వీడన్, పిన్‌లాండ్‌కు చెందిన గేమ్స్ టాప్ 10 సెర్చ్‌లో నిలిచాయి.
చైనాకు చెందిన బ్లాక్‌మిత్ విషయానికి వస్తే అత్యధికంగా సెర్చ్ చేసిన గేమ్‌గా నిలిచింది. ఇక పుడ్ అండ్ డ్రింక్ విషయానికి వస్తే ఈ ఏడాది ఒలింపిక్స్‌లో చాకొలేట్ ముఫిన్స్ గ్లోబల్ హిట్ అయ్యింది. నార్వేకు చెందిన స్విమ్మర్ హెన్రీక్ క్రిస్టియాన్‌సిన్ తన ఎనర్జీకి ఈ ముఫిన్స్ కారణమని ప్రకటించడంతో ఈ ముఫిన్ హిట్ అయ్యింది. ఇక పుడ్ విషయానికి వస్తే చైనీస్ స్ర్టీట్ ఫుడ్ తాంగులు ట్రెండిగా మారింది.
అలాగే చైనాకు చెందిన టైనీ మాక్‌ను కూడా ఈ ఏడాది ఎక్కువ సెర్చి చేశారు. కాగా దీన్ని క్లాసిక్ కంఫర్ట్ డిష్ పేర్కొన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ఈ డిష్‌ను ఇష్టపడుతున్నాని గూగుల్ సెర్చ్‌లో తేలింది. ఇక 2024 గుడ్ బై చెబుతూ.. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. మరి 2025 కొత్త సంవత్సరంలో ఏ అంశాలు గూగుల్‌లో ట్రెండీగా మారుతాయో వేచి చూద్దాం.
Reporting :
MahipalReddy, Hyderabad
MOST READ :
-
Social Media : సోషల్ మీడియా మాయలో మీ మెదడు పుచ్చిపోయిందా.. బ్రెయిన్ రాట్‌తో జాగ్రత్త..!
-
Rythu Bharosa : రైతు భరోసా వారికి మాత్రమే.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన..లేటెస్ట్ అప్డేట్..!
-
Beer : బీర్ ఆల్కహాల్ కాదా.. అక్కడ విచ్చల విడిగా బీర్ తాగుతారా..!
-
Nalgonda : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. దామరచర్లకు చెందిన బాలింత మృతి..!
-
Holidays : సంక్రాంతి హాలిడేస్ పై క్లారిటీ.. ఎన్ని రోజులు సెలవులో తెలుసా..!










