Suryapet : భార్య భర్తలు ఆత్మహత్య.. ఆలస్యంగా వెలుగులోకి..!

Suryapet : భార్య భర్తలు ఆత్మహత్య.. ఆలస్యంగా వెలుగులోకి..!
ఆత్మకూర్ ఎస్, మనసాక్షి :
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం
మండల పరిధిలోని బోట్యా తండా గ్రామంలోని వృద్ధ దంపతులు అనారోగ్యంతో బాధపడుతూ ఒంటి పై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తండా కు చెందిన భూక్యా లచ్చు (65), భూక్యా వీరమ్మ (60) దంపతులు గత కొంత కాలంగా అనారోగ్య సమస్య ల తో బాధ పడుతున్నారు.
ఆదివారం రాత్రి ఇంట్లో గడియ పెట్టుకొని ఒంటి పై పెట్రోల్ పోసుకుని నిప్పంటుచుకొని ఆత్మహత్య కు పాల్పడ్డారని తెలిపారు. పక్కన ఉన్న ఇరుగు పొరుగు కుటుంబాల వారు ఇంట్లో నుండి పొగలు, కేకలు రావడం తో కిటికీలు పగులగొట్టి లోపలి కెల్లి చూడగా వీరమ్మ అప్పటికే మృతి చెందగా లచ్చు తీవ్ర గాయాలతో ఉన్నాడని చికిత్స నిమిత్తం సూర్యాపేట హాస్పిటల్ కు తరలించారు.
చికిత్స పొందుతూ లచ్చు చనిపోయినట్లు తెలిపారు. మృతుల చిన్నకుమారుడు భూక్యా మోహన్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.మృతులకు ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఉన్నారు.
MOST READ :
-
Suryapet : ఆయిల్ పామ్ సాగు పై క్షేత్ర సందర్శన కు వెళ్లిన రైతులు..!
-
Alumni : 33 ఏళ్ల తర్వాత ఆత్మీయ కలయిక.. గత జ్ఞాపకాలతో పూర్వ విద్యార్థులు..!
-
Ring : బొటనవేలికి వెండి ఉంగరం.. జ్యోతిష్య, ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకుందాం..!
-
District collector : విధుల పట్ల నిర్లక్ష్యం.. జిల్లా కలెక్టర్ సీరియస్, ప్రిన్సిపాల్ కు షోకాజ్..!









