Miryalaguda : జ్యోతి హాస్పిటల్ లో మహిళ మృతి.. బంధువుల ఆందోళన, ఫర్నిచర్ ధ్వంసం..!
Miryalaguda : జ్యోతి హాస్పిటల్ లో మహిళ మృతి.. బంధువుల ఆందోళన, ఫర్నిచర్ ధ్వంసం..!
వైద్యుల నిర్లక్ష్యం అంటూ బంధువుల ఆరోపణ
హాస్పిటల్ ఎదుట బంధువుల ఆందోళన, ఫర్నిచర్ ధ్వంసం
మిర్యాలగూడ :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని జ్యోతి హాస్పిటల్ లో వైద్యం కోసం హాస్పిటల్ కి వచ్చిన మహిళ మృతి చెందిన ఘటన గురువారంచోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన చెవులపాటి జానకమ్మ (65) అనే మహిళ గత మూడు రోజుల క్రితం గుండెనొప్పితో జ్యోతి హాస్పిటల్ లో వైద్యం కోసం చేరారు.
చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందారు. అయితే జానకమ్మ మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ఆమె కుటుంబసభ్యులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. హాస్పిటల్ లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు.
గంట ముందు వరకు ఆరోగ్యంగా ఉన్న తమ తల్లిని వైద్యం కోసం ల్యాబ్ లోకి తమకు చెప్పకుండానే తీసుకువెళ్లి నిర్లక్ష్యంతో వ్యవహరించి సరైన వైద్యం చేయకుండా తమ తల్లి మృతికి డాక్టర్లు కారణమయ్యారని మృతురాలి కుమారుడు రమేష్ ఆరోపించారు. అంతేగాక తమ తల్లి జానకమ్మచనిపోయినప్పటికీ నిర్ధారించకుండా డాక్టర్లు జాప్యం చేశారని అన్నారు. సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితినిసమీక్షించారు.
ఈ విషయంపై జ్యోతి హాస్పిటల్ ఎండీ డాక్టర్ మువ్వా రామారావు వివరణ ఇస్తూ జానకమ్మ మృతిలో డాక్టర్ల నిర్లక్ష్యం లేదన్నారు. ఆమెకు ఎంజోగ్రామ్ చేసి స్టెంట్లు వేసేందుకు ల్యాబ్ లోకి తీసుక వెళ్తుండగా రెండోసారి ఆకస్మికంగా గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు తెలిపారు.
MOST READ :
-
Fertilizer : ఎరువుల డీలర్లకు జిల్లా వ్యవసాయ అధికారి సీరియస్ వార్నింగ్.. గోదాములలో ఎరువుల నిల్వల తనిఖీ..!
-
Nalgonda : చదివింది ఏడవ తరగతి.. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ప్రాజెక్టు ఆఫీసర్.. రూ. 17 లక్షలతో పరార్..!
-
WhatsApp : ఇక వాట్సాప్ కు శుభం కార్డేనా.. ఈ విషయం తెలిస్తే షాక్..!
-
Miryalaguda : ఐఐటి ఓపెన్ క్యాటగిరీలో ఆల్ ఇండియా 29వ ర్యాంక్..!
-
Nalgonda : నల్గొండ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్.. ఏడు గంటల్లో చేదించిన పోలీసులు.. కిడ్నాప్ ఎందుకో తెలిస్తే షాక్..!









