Nalgonda : మహిళల ఆశీర్వాదం, అభిమానంతో ఈ స్థాయికి వచ్చా.. మంత్రి కోమటిరెడ్డి..!
Nalgonda : మహిళల ఆశీర్వాదం, అభిమానంతో ఈ స్థాయికి వచ్చా.. మంత్రి కోమటిరెడ్డి..!
నల్లగొండ, మన సాక్షి :
తెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం నల్గొండ పట్టణంలోని వెంకటేశ్వర హోటల్ (బ్యాంకట్ హాల్లో) నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ , జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గోపగాని మాధవి అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో 150 సీట్లు ఉంటే అందులో 50 మంది మహిళలే ఎమ్మెల్యేలుగా ఉంటారని అన్నారు.
మహిళా బిల్లు కూడా త్వరలో అమలవుతుందని పేర్కొన్నారు. బీసీ కులగనణతో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ వర్తిస్తుందని పేర్కొన్నారు. మహిళా సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని స్పష్టం చేశారు.
ఉచిత బస్సు సౌకర్యం, మహిళా సంఘాలకు క్యాంటీన్ల వంటి సౌకర్యం కల్పించిందన్నారు. అదే విధంగా త్వరలో 1000 కొత్త ఆర్టీసీ బస్సుల మెయింటెనెన్స్ ను మహిళా సంఘాలకు అప్పగించి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. వీటిలో నల్గొండ జిల్లాలోని మహిళా సంఘాలకు 50 బస్సులను కేటాయించడం జరుగుతుందని స్పష్టం చేశారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మహిళా సంఘాలను లక్ష్యాధికారిని చేసిన విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ప్రత్యేక చొరవ తీసుకుంటుందని స్పష్టం చేశారు.
ఇంట్లో భర్తతో పాటు భార్య సమానంగా పనిచేస్తే ఆర్థిక అభివృద్ధి చెంది ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని అన్నారు. దీంతో మన పిల్లలు కూడా ఆ దిశగా ముందడుగు వేస్తారని అన్నారు. ముఖ్యంగా మహిళల ఆశీర్వాదం, అభిమానంతో తాను ఈ స్థాయికి వచ్చానని అన్నారు. మీ రుణం తీర్చుకోవడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, మీ కష్ట సుఖాలలో పాలుపంచుకుంటానని తెలిపారు. నల్గొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు.
550 కోట్లతో బైపాస్ రోడ్డు టెండర్లు ఖరారు అయ్యాయని పేర్కొన్నారు. భూములు కోల్పోయిన వారికి నష్టం వాటిల్లకుండా వారికి మార్కెట్ రేటు ప్రకారం పరిహారం అందించడం జరుగుతుందని తెలిపారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్, వరంగల్ ఎయిర్ ఫోర్ట్ పనులు ఆర్ అండ్ బిశాఖ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. రైల్వే సమస్యలపై ఎయిర్ పోర్ట్ లో ఆ శాఖ మంత్రిని ఈరోజు పలువురు మంత్రులతో కలిసి చర్చించడం జరిగిందని పేర్కొన్నారు.
మహిళా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, మహిళా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బ రూప అశోక్ సుందర్, రాష్ట్ర కార్యదర్శి ఎస్కే జాను,
పట్టణ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కందిమల్ల నాగమణి రెడ్డి, జిల్లా కార్యదర్శి లలిత, సదాలక్ష్మి, సంకు ధనలక్ష్మి, విజయలక్ష్మి, కంచర్ల మాధవి, జూలకంటి ధనలక్ష్మి, సూరెడ్డి సరస్వతి, స్వరూప రెడ్డి సౌజన్య, సుకన్య, నిర్మలాదేవి, సువర్ణ, పద్మ, గడిగ హిమబిందు, చిన్నాల అలివేలుతో పాటు పలువురు మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ కౌన్సిలర్లు, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
MOST READ :
-
TG News : తెలంగాణలో మహిళలకు కుటుంబ భరోసా కు రూ.10 లక్షలు.. మంత్రి సీతక్క కీలక ప్రకటన..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే కొత్త రూల్స్.. ఇలా చేయకుంటే మీ లావాదేవీలు ఆగిపోతాయి..!
-
Viral Video : భార్య ముందే రైలులో నిద్రిస్తున్న మరో యువకుడితో.. ఛీ ఛీ.. ఇదేం పని రా..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఉద్యోగ సంఘాలు హ్యాపీ..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ జలక్.. ఇకపై వాటికి చార్జీల మోత..!









