Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కరించడానికి కృషి.. INTUC జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి..!

విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని ఐ ఎన్ టి యు సి జాతీయ అధ్యక్షుడు. మా జీ ఎంపీ,సంజీవరెడ్డి తెలిపారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వంతో చర్చిస్తున్నామని చెప్పారు.

Nalgonda : విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కరించడానికి కృషి.. INTUC జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి..!

నల్లగొండ, మన సాక్షి  :

విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని ఐ ఎన్ టి యు సి జాతీయ అధ్యక్షుడు. మా జీ ఎంపీ,సంజీవరెడ్డి తెలిపారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వంతో చర్చిస్తున్నామని చెప్పారు.
తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 2026 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం నల్గొండ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సంజీవరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లో ఆర్టిజన్లుగా కొనసాగుతున్న వారిని పరిమినెంట్ చేయాలని కోరారు. పేరివిజన్ కమిషన్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 327 అధ్యక్షుడు సురేష్ కుమార్ మాట్లాడుతూ ఆర్టిజన్ల గ్రేడ్ సమస్య ఎంతో కాలంగా పెండింగ్లో ఉందని, దానిని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.

దీనిపై సంస్థ ఉన్నతాధికారులకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తప్ప నేటి వరకు దానిని నెరవేర్చలేదని అన్నారు. ప్రభుత్వం ఏది ఉన్నప్పటికీ కార్మికుల కోసం దేనినైనా ఎదిరిస్తామని చెప్పారు. కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి అన్ని విధాలుగా న్యాయం చేస్తామని చెప్పారు.

తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 327 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి కంపెనీ సెక్రటరీ భూపాల్ రెడ్డి, ఎంవి రాఘవరెడ్డి, నల్గొండ జిల్లా అధ్యక్షుడు జే అమర్ కుమార్ రెడ్డి, కార్యదర్శి నిరంజన్ అలీ, కోశాధికారి హరిప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి సమ్మి రెడ్డి, నీలం ఐలేష్, కే శ్రీనివాస్, అబ్దుల్ మాజీద్, మహేందర్ రెడ్డి, మాధవరావు, సాయిబాబా, శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

MOST READ NEWS 

మరిన్ని వార్తలు