TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లా
Local Elections : ఓటర్ల ఆకర్షణ కోసం తప్పని తిప్పలు.. స్థానిక పోరులో ఎల్ఈడి స్క్రీన్..!

Local Elections : ఓటర్ల ఆకర్షణ కోసం తప్పని తిప్పలు.. స్థానిక పోరులో ఎల్ఈడి స్క్రీన్..!
వెల్దండ, మన సాక్షి :
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రచార హోరు పెరుగుతుంది. అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించుకునేందుకు వినూత్న రీతిలో ప్రచారాలు చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ గ్రామపంచాయతీ తొలి విడత స్థానిక పోరులో భాగంగా ప్రధాన పార్టీల మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థులు వినూత్న ప్రచారాలకు శ్రీకారం చుట్టారు. మండలంలోని ఇంటి గ్రామాల్లో గుర్తులను ఏకంగా చేత పెట్టి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
వెల్దండ గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన మట్ట యాదమ్మ తన భర్త మట్టా వెంకటే గౌడ్ గత కొంతకాలంగా చేపట్టిన అభివృద్ధి పనులు, చేసిన సహాయాలకు సంబంధించిన ఫోటోలు, పత్రికల క్లిప్పింగ్లు, చేపట్టిన పనులను పాటల రూపంలో వివరిస్తూ ప్రత్యేకంగా తయారుచేసిన వాహనంలో ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రదర్శిస్తూ ప్రచారం నిర్వహించారు.









