TOP STORIESBreaking Newsజాతీయం
WhatsApp : మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్.. ఎలా చేస్తారంటే.. బిగ్ అలర్ట్..!

WhatsApp : మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్.. ఎలా చేస్తారంటే.. బిగ్ అలర్ట్..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరు వాట్సప్ వినియోగిస్తున్నారు. ఒక్కొక్కరు రెండు వాట్సప్ లు కూడా వినియోగిస్తున్నారు. అయితే సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ను టార్గెట్ చేశారు. వాట్సప్ హ్యాక్ చేసి పలు నేరాలకు పాల్పడుతున్నారు.
ఇటీవల వాట్సప్ హ్యాకింగ్ పెరిగిపోవడంతో ఫైబర్ క్రైమ్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే మీ వాట్సాప్ హ్యాకింగ్ కాకుండా సెట్టింగ్స్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు మీ వాట్సాప్ ను ఎలా హ్యాక్ చేస్తారో తెలుసుకుందాం..
-
సాధారణంగా నేరగాళ్లు వాట్సాప్ సపోర్ట్ టీమ్ గా అధికారికంగా యూజర్లకు ఫోన్ చేసి నమ్మిస్తారు. ఆ తర్వాత ఓటిపిని చెప్పమంటారు. పొరపాటున చెప్పేస్తే ఇక హ్యాక్ అయినట్లే.
-
సైబర్ నేరగాళ్లు యూజర్ కు ఫోన్ కు బ్రీఫ్ గా యాక్సెస్ చేస్తారు. వాట్సాప్ ను వాట్స్అప్ వెబ్ కు లింక్ చేస్తారు. రిమోట్ యాక్సెస్ చేస్తారు. దీని ద్వారా వెబ్ హైజాక్ చేస్తారు.
-
సైబర్ స్కామర్లు వాట్సప్ కాల్ చేసి మెడ్జ్ చేయమంటారు. వాట్సాప్ యూజర్లకు అనుమానం రాకుండా వారి కాల్ ఆటోమేటెడ్ వాట్సాప్ ఓటిపి వెరిఫికేషన్ కాల్ కి కనెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఓటిపి విని ఎకౌంటును హాక్ చేస్తారు.
వాట్సప్ హ్యాకర్ల నుంచి రక్షించుకోవడం ఎలా..!
-
వాట్సాప్ సెట్టింగ్ లో టు ఫ్యాక్టర్స్ అథంటికేషన్ ని ఎనేబుల్ చేయాలి.
-
ఎకౌంట్ సేఫ్టీ కోసం అదనంగా సెక్యూరిటీ పిన్ సెట్ చేసుకోవాలి.
-
వాట్సాప్ నుంచి ఎలాంటి అధికారులు ఫోన్ చేసి ఓటిపి అడగరు.
-
ఎవరైనా కాల్ చేసి ఒకవేళ అడిగితే అడిగిన అది కూడా షేర్ చేయకూడదు.
-
వాట్సాప్ వెబ్ లో తరచుగా చెక్ చేసుకోవాలి. వాట్సాప్ సెట్టింగ్ లో లింక్ డివైజెస్ గుర్తుతెలియని డివైస్ ల నుంచి లాగౌట్ కావాలి.
-
ఐఫోన్ యూజర్ అయితే లాక్ డౌన్ లోడ్ ఆక్టివేట్ చేసుకుంటే అనధికారిక డివైస్ లింకులను అనుమతించబడవు.
-
అదేవిధంగా అనుమానాస్పదమైన మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
-
కాల్స్ ఎప్పుడు మెర్జ్ చేయవద్దు.
Similar News:
-
WhatsApp : వాట్సాప్ యూజర్స్ కు బిగ్ అలర్ట్.. జీరో క్లిక్ హ్యాకింగ్..!
-
WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. వారికి కూడా కాల్ చేయొచ్చు..!
-
WhatsApp : మీ వాట్సాప్ కూడా హ్యాక్ చేస్తున్నారా.. ఇది తెలుసుకోండి, లేదంటే ప్రమాదమే..!
-
WhatsApp : వాట్సాప్ లో డిలీట్ అయిన చాట్ చూడాలా.. అయితే ఈ సింపుల్ టిప్స్ మీకోసం..!









