వలిగొండ : 25 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు

వలిగొండ : 25 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు

వలిగొండ , మన సాక్షి:

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ప్రగతి హై స్కూల్ లో విద్యనభ్యసించినటువంటి 1997 -98 విద్యా సంవత్సరానికి 10వ తరగతి చదివినటువంటి విద్యార్థి అంతా కలిసి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం మేడిపల్లిలోని డి.బి.ఆర్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా చేసుకోవడం జరిగింది.

 

దాదాపుగా 25 సంవత్సరాల తర్వాత కలుసుకున్న తమ మిత్రులను చూసి భావోద్వేగంతో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. అటు తరువాత సభా కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఎవరికి వారు తమ యొక్క వృత్తి పరంపరలను పరిచయం చేసుకున్నారు. విద్యార్థులు చెబుతున్న వివరాలను విన్న ఉపాధ్యాయులు తమ విద్యార్థులు చేస్తున్న ఉద్యోగాల వివరాలను విని చాలా సంతోషపడ్డారు.

 

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రేగు మల్లయ్య, గంగాధరి బిక్షపతి, నవీన్ అదేవిధంగా విద్యార్థులు నల్లగంటి శంకర్ గుండా సంతోష్, బోళ్ల రమేష్, దుబ్బ కిషన్, కొండూరు ఋషి వాస్ ,మంగ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు