TGSRTC : తెలంగాణ ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ.. నోటిఫికేషన్ పై మంత్రి పొన్నం కీలక ప్రకటన..!
TGSRTC : తెలంగాణ ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ.. నోటిఫికేషన్ పై మంత్రి పొన్నం కీలక ప్రకటన..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
ఆర్టీసీలో ఖాళీ ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనున్నారు. ఆర్టీసీలో 3038 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్న ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. ఈ ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వంలో భాగంగా ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణం అందిస్తున్నట్లు, దానివల్ల మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ఆర్టీసీలో 165 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని పేర్కొన్నారు. దాంతో ఇప్పటివరకు మహాలక్ష్మి కోసం కొత్త బస్సులు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.
ఖాళీ ఉద్యోగాలు మొత్తం 3038
డ్రైవర్ – 2000
శ్రామిక్ – 743
డిప్యూటీ సూపరిండెంట్ (ట్రాఫిక్) – 84
డిప్యూటీ సూపరిండెంట్ (మెకానికల్) – 114
డిపో మేనేజర్/ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ – 25
అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ – 18
అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 23
సెక్షన్ ఆఫీసర్ (సివిల్) – 11
అకౌంట్ ఆఫీసర్స్ – 06
మెడికల్ ఆఫీసర్స్ జనరల్ – 07
మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ – 07
ఈ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ రానున్నది. ఇప్పటివరకు భారీ స్థాయిలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయనున్నదని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆర్టీసీలో సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి పార్టీ విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.
MOST READ :
-
Check Post : కర్ణాటక – తెలంగాణ సరిహద్దుల్లో ఆరు చెక్ పోస్టుల ఏర్పాటు..!
-
Badi Bata : ముందస్తు బడిబాట.. ఉపాధ్యాయులు, విద్యార్థుల ర్యాలీ..!
-
WhatsApp New Feature : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది..!
-
Tea : రోడ్ సైడ్ టీ భలే టేస్ట్ గా ఉందా.. అయితే ఈ సీక్రెట్ తెలిస్తే మళ్లీ ఎప్పుడు తాగరు..!
-
TG News : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 10,945 జిపిఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్.. లేటెస్ట్ అప్డేట్..!









