Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్రాజకీయం

వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం

వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం

మెలియాపుట్టి. మన సాక్షి:

వైసిపి తరుపున ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీతంరాజు సుధాకర్ ను గెలిపించాలని రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ కోరారు. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండల కేంద్రంలో శుక్రవారం ఎమ్మెల్సీ అభ్యర్థి తరుపున ప్రచారం చేశారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఓటర్ల ఇంటికి వెళ్లి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సీతం రాజుకు మొదట ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటరు లను అభ్యర్థించారు. వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుతోనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

 

ఆయనతోపాటు వైసీపీ నేతలు అనపాన రాజశేఖర్ రెడ్డి, జే. కన్నబాబు, ఎస్ ఆది నాయుడు, రవీంద్రజెన్న, వాసు ,చంద్ర రావు, ఋషి, రవి, చిన్న తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు