Rayala Telangana : రాయల తెలంగాణ పై మంత్రి జగదీష్ రెడ్డి ఏమన్నాడంటే..?
రాయల తెలంగాణ పై మంత్రి జగదీష్ రెడ్డి ఏమన్నాడంటే..?
సూర్యాపేట , మనసాక్షి
కేసీఆర్ నాయకత్వంతోనే సువర్ణ ఆంధ్రప్రదేశ్ సాకారం అవుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోఆయన విలేకరులతో మాట్లాడారు. రాయల తెలంగాణ అంశం వదిలి ఆ దిశగా ఆంధ్ర ప్రజలు ఆలోచించాలని, అక్కడ ప్రభుత్వాల వైఫల్యాలతోనే రాయల తెలంగాణ అంశం తెర మీదకు వచ్చిందన్నారు.
ప్రత్యేక రాయలసీమ , రాయల తెలంగాణ ఇప్పుడు సాధ్యం కాదుఅని, రాయల తెలంగాణ కోరుడం తెలంగాణ అభివృద్ధి దిశగా దూసుకుపోవడమే కారణమన్నారు.
తెలంగాణలో కలపాలని తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు కోరడం కేసీఆర్ అభివృద్ధికి నిదర్శనం అన్నారు.
తెలంగాణా లో కలపండి లేకపోతే మా దగ్గరికి రండి అని కేసీఆర్ ని ఆహ్వానిస్తున్నారు.
తెలంగాణ బంగారు తెలంగాణగా మారినట్టి సువర్ణాంధ్ర నిర్మాణం సాధ్యమని గతంలోనే చెప్పారు. పరిపాలకుల చిత్తుశుద్ధి లోపంతో ఇలాంటి డిమాండ్లు వస్తున్నాయిఅని
పరిపాలకులను మార్చండి సువర్ణాంధ్ర గా మార్చుకోండి అంటూ కేసీఆర్ నాయకత్వాన్ని ఆంధ్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారని అన్నారు.
వెనుకబాటుకు కారణమైన పారిపాలకుల మీద ఆంధ్ర ప్రజలు తిరుగుబాటు చేయాలని అభివృద్ధి సాధించే నాయకత్వాన్ని కోరుకొంటు దిశగా ఆంధ్ర ప్రజలు నాయకులు ఆలోచించాలని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ఉన్నారు.









