Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

మాడ్గులపల్లి : మట్టి తరలింపును అడ్డుకున్న గ్రామస్తులు

మాడ్గులపల్లి : మట్టి తరలింపును అడ్డుకున్న గ్రామస్తులు

మాడ్గులపల్లి, మనసాక్షి:

నల్గొండ జిల్లా మాడ్గులపల్లిలోని నల్లకుంట నుంచి తరలిస్తున్న మట్టి తరలింపును గ్రామస్తులు బుధవారం అడ్డుకున్నారు. మట్టిని గ్రామ సమీపంలో ఉన్న టోల్ ప్లాజా ఆవరణలో పూడిపోయటానికి తరలిస్తున్నారు.

 

ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రైతులు అక్కడ కి చేరుకొని మట్టి తరలింపును నిలిపివేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి రైతులకు, గ్రామస్థులకు నచ్చచెప్పి పనులను నిలిపివేశారు. ఇట్టి విషయం పై ఇంచార్జి తహసీల్దార్ శివ శంకర్ ను వివరణ కోరగా మట్టి తరలింపు కు అనుమతులు ఉన్నాయని తెలిపారు.

మరిన్ని వార్తలు