Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంహైదరాబాద్

Rythu Bandhu : రైతుబంధు జాబితాలో మీ పేరు ఉందా? డబ్బులు ఎకౌంట్ లో పడ్డాయో..? లేదో..? ఇలా చెక్ చేసుకోండి..!

Rythu Bandhu : రైతుబంధు జాబితాలో మీ పేరు ఉందా? డబ్బులు ఎకౌంట్ లో పడ్డాయో..? లేదో..? ఇలా చెక్ చేసుకోండి..!

హైదరాబాద్, మనసాక్షి :

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు పెట్టుబడి సహాయంగా రైతుబంధు పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం విజయవంతంగా కొనసాగుతుంది. రైతుబంధు పథకం ద్వారా అర్హులైన రైతులందరికీ వారి వారి ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అవుతున్నాయి.

 

ఎకరానికి పదివేల రూపాయల చొప్పున రెండు విడతలుగా వాన కాలంలో రూ. 5 వేలు, యాసంగిలో 5 వేల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం వానకాలం సీజన్ కు సంబంధించి రైతుబంధు పెట్టుబడి సహాయం డబ్బులు 11 వ విడుత జూన్ 26వ తేదీ నుంచి రైతుల ఖాతాలలో జమ చేస్తున్నారు.

 

మొదటగా ఒక ఎకరంలో ఉన్న రైతులకు ఖాతాలలో జమ చేయగా ఆ తర్వాత రోజుకు ఒక ఎకరం చొప్పున పెంచుతూ రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేస్తున్నారు. వానాకాలం సీజన్ కు గాను రైతుబంధు పథకం రెండవ విడత డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు .

 

రైతు బంధు అర్హుల జాబితా తెలుసుకునేందుకు ;

ముందుగా రైతుబంధు అర్హుల జాబితాలో మన పేరు ఉందా లేదా తెలుసుకునేందుకు గాను http://rythubandhu.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి హోం పేజీలో ఉన్న రైతు బంధు పథకం మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మరో పేజీ ఓపెన్ అవుతుంది.

 

ఆ పేజీ కింది భాగంలో చెక్ డిస్టిబ్యూషన్ వెన్యూ షెడ్యూల్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత పేజీలో జిల్లా , మండలం నమోదు చేసి ఎంటర్ చేస్తే రైతుబంధు లబ్ధిదారుల లిస్టు కనిపిస్తుంది. దాంట్లో మీ పేరు ఉందో? లేదో..? చెక్ చేసుకోవాలి.

 

రైతుబంధు డబ్బులు మీ ఖాతాలో వచ్చాయా..? లేదా..?

రైతుబంధు డబ్బులు మీ ఖాతాలోకి వచ్చాయా? లేదా..? అనే విషయాన్ని కూడా ఇలా చెక్ చేసుకోవచ్చును. తెలంగాణ అధికారిక ట్రెజరీ వెబ్ సైట్
http://treasury.telangana.gov.in ఈ లింకు పైన లిఫ్ట్ చేసిన తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ హోమ్ పేజీ మెనూ బార్ లో రైతుబంధు పథకం ఖరీఫ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది దానిని ఎంచుకోవాలి.

 

అక్కడ అడిగిన వివరాలను బట్టి రైతుబంధు అందుకునే సంవత్సరం, టైప్, పిపిబి (పట్టాదార్ పాస్ బుక్) నెంబర్ నమోదు చేసుకొని సబ్మిట్ చేయాలి. స్కీమ్ వైస్ రిపోర్ట్ ఎంచుకొని మీ వివరాలు ఇవ్వాలి. వివరాలు మొత్తం నమోదు చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు రైతుబంధు నగదు ఖాతాలో జమ అయిందో..? లేదో..? తెలుస్తుంది.

 

♦️ఎక్కువమంది చదివిన వార్తలు మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి 👇 

 

  1. RBI : రూ. 2 వేల నోట్ల రద్దు పై ఆర్బీఐ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
  2. No Bag Day : తెలంగాణలో ‘నో బ్యాక్ డే’ .. ఆరోజు ఏం చేయాలంటే..?
  3. Viral Video : మోటార్‌సైకిల్‌పై ప్రేమికుల విచిత్ర సంఘటన, రూ. 21 వేలు చలాన్ ( వీడియో వైరల్)
  4. Govt Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. ఉద్యోగాల భర్తీకి తాజా నోటిఫికేషన్..!
  5. Rythu Bandhu scheme : రైతుబంధుపై కీలక ప్రకటన.. రైతులకు గుడ్ న్యూస్…!
  6. CM KCR : సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం .. 30వ తేదీ నుంచి పంపిణీ షురూ..!

మరిన్ని వార్తలు