No Bag Day : తెలంగాణలో ‘నో బ్యాక్ డే’ .. ఆరోజు ఏం చేయాలంటే..?

No Bag Day : తెలంగాణలో ‘నో బ్యాక్ డే’ .. ఆరోజు ఏం చేయాలంటే..?
హైదరాబాద్ , మన సాక్షి :
తెలంగాణలోని అన్ని రకాల పాఠశాలల్లో నో బ్యాగ్ డే అమలు చేయనున్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా రోజూ.. పాఠాలు విన్న విద్యార్థులకు రిలీఫ్ గా ఉండే విధంగా ప్రతి నెల ఒకరోజు నో బ్యాగ్ డే నిర్వహించనున్నారు.
ప్రతి నెల నాలుగవ శనివారం నో బ్యాగ్ డే నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ఆదేశించింది. 2020 నిబంధనల ప్రకారం ఏడాదిలో పది రోజులు విద్యార్థులు బ్యాగ్ లేకుండా పాఠశాలకు వచ్చేలా చూడాలని సూచించింది.
నో బ్యాగ్ డే రోజు విద్యార్థులు ఏ కార్యక్రమాలు చేపట్టాలనే విషయాలపై NCERT ఒక ప్రత్యేక పుస్తకాన్ని ముద్రించింది. నో బ్యాగ్ డే రోజు విద్యార్థులు 28 రకాల కార్యక్రమాలు చేయాల్సి ఉంది. వాటిలో వారి వారి సామర్థ్యాన్ని ఆధారంగా ఉపయోగించేలా అవకాశం ఉంది.
ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి 👇
- CM KCR : సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం .. 30వ తేదీ నుంచి పంపిణీ షురూ..!
- Govt Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. ఉద్యోగాల భర్తీకి తాజా నోటిఫికేషన్..!
- Gruhalakshmi scheme : గృహలక్ష్మీ పథకంలో ప్రభుత్వం ఇచ్చే రూ. 3 లక్షలు రావాలంటే.. ఇవి ఉండాల్సిందే..!
- Kcr Govt Record : కెసిఆర్ సర్కార్ మరో రికార్డ్ .. ఆసియాలోనే అతిపెద్ద కాంప్లెక్స్, అదిరిపోయేలా సౌకర్యాలు..!
- Central scheme | ఈ పథకంలో చేరితే.. రైతులకు నెలకు రూ. 3 వేలు..!
మ్యూజియం, చారిత్రక ప్రదేశాలు, గ్రామపంచాయతీ కార్యాలయాల సందర్శన, సైన్స్ ప్రయోగాలు, పతంగుల తయారీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, గణిత కార్నర్, గణిత రంగోలి, మోడల్ ఎన్నికలు, మోడల్ అసెంబ్లీ, ఆర్థిక లావాదేవీలు, బాలిక విద్య పై స్కిట్, బెస్ట్ లెర్నింగ్ వీటిని అన్ని రకాల పాఠశాలల్లో తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంది.
1,2వ తరగతి విద్యార్థులు తమ కుటుంబం గురించి మాట్లాడమని , కుటుంబ సభ్యులలో ఒకరిని అనుకరించాలని కమ్యూనికేషన్ స్కిల్స్, సృజనాత్మకతను పెంపొందించే విధంగా కుటుంబ సభ్యుని స్కెచ్ ని గీయాలని అడుగుతారు.
3 – 5 వ తరగతి అభ్యాసంలో భాగంగా జీవనోపాధిపై థీమ్ తయారు చేయబడి ఉంది వారికి నచ్చిన వృత్తి గురించి మాట్లాడటం తో పాటు ఆ వృత్తిలో ఉపయోగించే సాధనాలను గీయమని అడుగుతారు.
6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కుటుంబ బడ్జెట్ సర్వే తో పాటు నిర్మాణ స్థలాలు, రేషన్ షాపుల సందర్శనతో పాటు మోడల్ అసెంబ్లీ, మోడల్ ఎన్నికలు, అవుట్ డోర్, ఇండోర్ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. కృత్తిమ మేధస్సు, అప్లికేషన్స్ అంశాలు కూడా పరిచయం చేస్తారు.