Kcr Govt Record : కెసిఆర్ సర్కార్ మరో రికార్డ్ .. ఆసియాలోనే అతిపెద్ద కాంప్లెక్స్, అదిరిపోయేలా సౌకర్యాలు..!

Kcr Govt Record : కెసిఆర్ సర్కార్ మరో రికార్డ్ .. ఆసియాలోనే అతిపెద్ద కాంప్లెక్స్, అదిరిపోయేలా సౌకర్యాలు..!

హైదరాబాద్ , మనసాక్షి :

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ మరో రికార్డు సృష్టించింది. ఆసియాలోనే అతిపెద్ద ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణం చేసి రికార్డు సృష్టించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి రికార్డు సృష్టించడంతోపాటు అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం ,అత్యాధునిక సౌకర్యాలు ,అతిపెద్ద అమర జ్యోతి తో అమరవీరుల స్తూపం నిర్మాణం చేసి రికార్డు సృష్టించిన సృష్టించింది.

 

అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ గృహ నిర్మాణ సముదాయంలో కూడా ఆసియా ఖండంలోనే రికార్డు సృష్టించింది. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో 1432.50 కోట్ల రూపాయల ఖర్చుతో అతి పెద్ద కాంప్లెక్స్ నిర్మాణం చేశారు .145 ఎకరాల విస్తీర్ణంలో 117 బ్లాక్ లలో 15,660 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించింది.

 

ఈ అతి పెద్ద గృహ నిర్మాణ సముదాయాన్ని 2023 జూన్ 22వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. అనంతరం ఎలక్ట్రిక్ వాహనంలో కాంప్లెక్స్ ప్రాంగణమంతా తిరిగారు.

 

🟢 ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి 👇

 

🔥 Forest Jobs : టెన్త్, ఇంటర్ అర్హతతో అటవీ శాఖలో ఉద్యోగాలు.. దరఖాస్తు విధానం..!

🔥 Telangana | తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం, అమర జ్యోతి అద్భుతం.. ప్రత్యేకతలు ఇవీ..!

🔥 Rythu Bandhu : రైతు బంధు కోసం దరఖాస్తులు చేసుకోవాలి..!

🔥 RBI : రూ. 30 వేల కంటే ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే.. ఆర్బీఐ క్లారిటీ..!

🔥 Latest Jobs : ఏదైనా డిగ్రీ ఉంటే.. ఉద్యోగ అవకాశాలు, భారీ ప్యాకేజీ..!

 

♦️ కెసిఆర్ నగర్ గా నామకరణం :

ఈ అతిపెద్ద కాంప్లెక్స్ కు ‘కెసిఆర్ నగర్ 2 BH k డిగ్నిటీ హౌసింగ్ కాలనీ’ గా నామకరణం చేశారు. దీనిలో ఒక్కో ఇంటిని 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం చేశారు.

 

జి ప్లస్ 9, జి ప్లస్ 10, జి ప్లస్ 11 అంతస్తుల్లో భారీ స్థాయిలో వీటిని నిర్మించారు. మొత్తం విస్తీర్ణంలో 37% భూమిని డబల్ బెడ్ రూమ్ నిర్మించగా మిగతా 63% భూమిని మౌలిక సదుపాయాల కోసం కేటాయించారు.

 

♦️ ఈ కాంప్లెక్స్ ప్రత్యేకతలు :

🟢 145 ఎకరాల విస్తీర్ణం.
🟢 117 బ్లాక్లులు, 15,660 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు.
🟢ఒక్కో ఇల్లు 560 చదరపు అడుగులు.
🟢 ప్రతి బ్లాక్ రెండు లిఫ్టుల చొప్పున మొత్తం 234 లెఫ్ట్ ల ఏర్పాటు.
🟢 ప్రతి బ్లాక్ లో జనరేటర్లు, ప్రతి ఫ్లోర్లో ఫైర్ సేఫ్టీ ఏర్పాటు.

🟢 36 మీటర్లు ,30 మీటర్ల ఔటర్ రోడ్డు.
🟢 8 మీటర్లు ,6 మీటర్లు ఇన్నర్ రోడ్డు .
🟢కాంప్లెక్స్ లో మొత్తం 12 అండర్ గ్రౌండ్ వాటర్ సంప్ లు ఏర్పాటు. సామర్థ్యం 11 లక్షల లీటర్లు .
🟢 90 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు.
🟢 ఇంకుడు గుంతల నిర్మాణం.
🟢 కరెంట్ కేబుల్స్ ను అండర్ గ్రౌండ్ ద్వారా ఏర్పాటు.
🟢 మురికి నీటి బాక్సులపై కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ ఏర్పాటు.

 

♦️ ఇవి సదుపాయాలు :

ఈ కాంప్లెక్స్ ప్రాంగణంలో బస్టాండు ,పోలీస్ అవుట్ పోస్టు, బ్యాంకు, ఏటీఎంలు, పోస్ట్ ఆఫీస్, మార్కెట్, పెట్రోల్ బంక్, ఫైర్ స్టేషన్, మున్సిపల్ బిల్డింగు , ప్రభుత్వ ఆసుపత్రి, పీహెచ్ సీ సెంటర్, గుడి, చర్చి, మూడు షాపింగ్ కాంప్లెక్స్ లు,

 

హై స్కూలు, అంగన్వాడి భవనాలు, ప్రతి సెక్టార్ లో పాల కేంద్రాలు, ఫంక్షన్ హాల్లు, విశాలమైన పార్కింగ్ స్థలం, కమ్యూనిటీ సెంటర్లు, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.